హరి హర వీరమల్లు చిత్రం తర్వాత బాబీ డియోల్ మరో దక్షిణాది సినిమాలో నటించటానికి రెడీ అయ్యారు. ఆ సినిమా ఏదో కాదు.. కంగువా. సూర్య కథానాయకుడిగా సిరుతై శివ దర్శకత్వంలో భారీగా రూపొందుతోన్న పీరియాడిక్ మూవీ ఇది. సూర్య పుట్టినరోజు సందర్బంగా వచ్చిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేసింది. ఇందులో విలన్‌గా బాబీడియోల్ నటిస్తున్నారు. సూర్య పాత్ర ఇందులో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయన పాత్రను ఢీ కొట్టాలంటే దాన్ని మించేలా విలన్ లుక్ ఉండాలి, క్యారెక్టరైజేషన్ ఉండాలి. ఎలా అని దర్శకుడు ఆలోచిస్తున్న తరుణంలో ఆయనకు బాబీ డియోల్ గుర్తుకు వచ్చారు. ఫిజికల్‌గానూ బాబీ డియోల్ బావుంటారు కనుక, తనైతే కంగువా పాత్రకు న్యాయం చేస్తారనిపించి ఆయన్ని మేకర్స్ సంప్రదించారు. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఆయన రోల్ ఎలా ఉంటుందనేది తెలియాంటే మాత్రం కొన్నాళ్లు ఆగ్సాల్సిందే.