సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ శిష్యుడు ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. విభిన్న కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా రేపు(జూలై 29న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా శ్రీలీల అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.