ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అధికంగా ప్రజల్ని పట్టిపీడిస్తున్న వ్యాధి ఏదైనా ఉందంటే అది మధుమేహం అని చెప్పవచ్చు.మధుమేహం( Diabetes )తో చాలామంది బాధపడుతున్నారు.
మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువగా బాధపడుతున్నారు.అయితే మధుమేహంతో బాధపడుతున్న వారు మిల్లెట్స్ తినడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
మిల్లెట్స్ లో అధిక పీచు, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటాయి.ఇవి మధుమేహం స్థాయిని నియంత్రిస్తాయి.
అంతేకాకుండా బరువును కూడా నియంత్రణలో ఉంచుతాయి.క్రమం తప్పకుండా చిరుధాన్యాలు తీసుకోవడం వలన ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు.

అయితే మధుమేహాన్ని అదుపులో ఉంచే కొన్ని ముఖ్య చిరుధాన్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు కొర్రలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.వీటిని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయి, కొలెస్ట్రాల్ ( Cholesterol )ట్రై గ్లిజరాయిడ్స్ తగ్గిస్తాయి.అలాగే గోధుమలు, బియ్యానికి బదులు కొర్రలతో చేసిన ఆహారం తీసుకోవడం వలన చక్కెర స్థాయిలని తగ్గిస్తాయి.
జొన్నలు ( Sorghum )తీసుకోవడం వలన కూడా రక్తంలో చక్కెర స్థాయి ఒకేసారి పెరగకుండా ఉంటుంది.ఎందుకంటే వీటిలో అధిక పీచు తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఉంటాయి.
ఇవి కొలెస్ట్రాల్ ను పెరగకుండా చేస్తాయి.అలాగే బరువు తగ్గేలా కూడా సహాయపడతాయి.

ఊదలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.ఇవి మెల్లగా జీర్ణం అవుతాయి.వీటి గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.డయాబెటిస్, గుండె సంబంధిత బాధపడుతున్న వారు ఊదలు</em( Udalu ) తీసుకోవడం చాలా ఉత్తమం.రాగులు తీసుకోవడం వలన చాలా పోషకాలు లభిస్తాయి.ఇతర చిరుధాన్యాలు, తృణధాన్యాలలో కన్నా రాగుల్లో క్యాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచుతాయి.సజ్జలు తీసుకోవడం వలన డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది.
వేరే ఆహారాలతో పోలిస్తే సజ్జలు మెల్లగా జీర్ణం అవుతాయి.గ్లూకోస్ ను రక్తంలోకి మెల్లగా విడుదల అయ్యేలా చేస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణంగా ఉండేలా చేస్తాయి.
