మణిశర్మ లేకుండా పూరీ పెద్ద రిస్క్ 

Date:


ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ- మణిశర్మ ఇద్దరికీ చెడినట్టు తెలుస్తుంది. అందుకే పూరీ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కి మణిశర్మ కాకుండా మరో సంగీత దర్శకుడిని లాక్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడట. తమన్ లేదా అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇస్మార్ట్ శంకర్ కి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చి సక్సెస్ లో కీ రోల్ పోషించిన మణిశర్మ ను పక్కన పెట్టేసి పూరీ మరో మ్యూజిక్ డైరెక్టర్ తో పెద్ద రిస్కే చేస్తున్నట్టే. డబుల్ ఇస్మార్ట్ కి మణిశర్మ ను మ్యాచ్ చేసే మ్యూజిక్ ఇవ్వాలంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కయినా పెద్ద ఛాలెంజే.

ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘డబుల్ ఇస్మార్ట్’ టైటిల్ తో షూటింగ్ మొదలైన పూరీ -రామ్ కాంబినేషన్ సినిమాకు మణి శర్మ నే మ్యూజిక్ ఇస్తారని అందరూ ఊహించారు. కానీ ఈ క్రేజీ సీక్వెల్ కి మణిశర్మ మ్యూజిక్ ఇవ్వడం లేదని తెలుస్తుంది. దీనికి కారణం పూరీ -మణి మధ్యలో ఉన్న విబేధాలని ఇన్ సైడ్ టాక్. ‘ఇస్మార్ట్ శంకర్’ మ్యూజిక్ తర్వాత మణిశర్మ దాదాపు పది సినిమాల అవకాశాలు అందుకున్నాడు. ఆ సినిమా సాంగ్స్ తో మణి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తోనే చిరు ‘ఆచార్య’ కి అవకాశం ఇచ్చారు. 

టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ కాంబినేషన్స్ ఉన్నాయి. అందులో పూరీ- మణిశర్మ కాంబో ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ ఆల్బమ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘పోకిరి’ సినిమాకి మణి శర్మ ఇచ్చిన మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచింది. కొన్నేళ్ళుగా ఈ కాంబోలో సినిమా రాలేదు. ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ మణిశర్మ ఐయాం బ్యాక్ అనిపించుకున్నాడు. ఆ సినిమాకు అదిరిపోయే సాంగ్స్ తో పాటు ఎలివేట్ చేసే స్కోర్ అందించాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రొడ్యూస‌ర్‌కి ఎన్టీఆర్ సహాయం!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది. ప‌వ‌న్...

పర్మినెంట్‌ చేయాల్సిందే చిన్నచూపు చూస్తే వదలబోం

– సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మె...