‘భోళా శంకర్’ సినిమాని వదులుకున్న స్టార్ హీరో అతనేనా..? భలే సేఫ్ అయ్యాడుగా!

Date:


‘వాల్తేరు వీరయ్య'( Waltair Veeraiah ) లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్'( Bhola Shankar ).మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 11 వ తారీఖున ప్రపంచావ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.

 Pawan Kalyan Missed Bhola Shankar Movie Chance,pawan Kalyan,vedalam Remake,bhola-TeluguStop.com

ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మరియు పాటలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.మణిశర్మ కొడుకు మహతి సాగర్ ఈ రేంజ్ మ్యూజిక్ అందిస్తాడని అభిమానులు అంచనా వేయలేకపోయారు.

అంతకు ముందు ఈ చిత్రం పై రీమేక్ అనే కారణం చేత అభిమానులు చాలా తక్కువ అంచనాలు పెట్టుకున్నారు.కానీ ఎప్పుడైతే టీజర్ మరియు పాటలు వచ్చాయో, ఈ చిత్రం పై ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

దానికి తోడు పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తూ ఈ చిత్రం లో రీసెంట్ గా చిరంజీవి విడుదల చేసిన ఒక వీడియో కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

Telugu Ajith, Bhola Shankar, Chiranjeevi, Meher Ramesh, Pawan Kalyan, Tollywood,

ఇక పోతే ఈ చిత్రం తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్'( Vedalam Remake ) చిత్రానికి రీమేక్.ఇందులో తల అజిత్ హీరో గా నటించాడు, చెన్నై వరదలు బీభత్సం సృష్టిస్తున్న రోజుల్లో ఈ సినిమా విడుదలై సెన్సేషన్ ని సృష్టించింది.ఈ చిత్రాన్ని శ్రీ సూర్య మూవీ బ్యానర్ పై ఏ ఏం రత్నం నిర్మించాడు.ఈయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ లాంటి భారీ బడ్జెట్ పీరియడ్ డ్రామా ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.‘వేదలమ్’ తమిళం లో హిట్ అవ్వగానే, అప్పట్లో ఈ చిత్రాన్ని తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan )తో నిర్మిద్దాం అని అనుకున్నాడట ఏ ఏం రత్నం.కానీ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం తనకి సూట్ కాదని తప్పుకున్నాడు.ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈ చిత్రం రీమేక్ రైట్స్ ని అనిల్ సుంకర( Anil Sunkara ) కొనుగోలు చేసి మెగాస్టార్ చిరంజీవి తో తీసాడు.

Telugu Ajith, Bhola Shankar, Chiranjeevi, Meher Ramesh, Pawan Kalyan, Tollywood,

ఇప్పటికీ ఈ సినిమా ఎలా వచ్చిందో ఏమిటో అని అభిమానుల్లో కంగారు అయితే ఉంది.ఎందుకంటే మెహర్ రమేష్( Meher Ramesh ) బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ అలాంటిది మరి.ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో ఒక్క ‘బిల్లా'( Billa ) అనే చిత్రం మినహా , మిగిలినవన్నీ కమర్షియల్ గా బిగ్గెస్ట్ డిజాస్గటెర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.అందుకే అభిమానుల్లో ఒక్కటే టెన్షన్.

ఎలాంటి సినిమా ఇచ్చాడో ఏంటో అని.కానీ ఫ్లాప్స్ అనేవి ప్రతీ డైరెక్టర్ కి , హీరో కి కామన్.నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి.ఆ అవకాశం వచ్చినందుకు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్రం ద్వారా నిరూపించుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలుLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

‘సలార్’ పార్ట్1 లో ఎన్టీఆర్!

ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన స‌లార్ మూవీ ఎప్పుడో రావాల్సింది....

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ...

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...