భారీ ర్యాలీగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి పవన్..!!

Date:


జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తిరుపతి చేరుకున్నారు.కొద్ది రోజుల క్రితం జనసేన ( Janasena party )పార్టీకి చెందిన శ్రీ కొట్టే సాయిపై ఓ మహిళా పోలీసు చెయ్యి చేసుకోవడం తెలిసిందే.

 Pawan To The Sp Office Of Tirupati District As A Huge Rally Janasena, Pawan Kal-TeluguStop.com

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతూ ఉంది.పరిస్థితి ఇలా ఉంటే ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి సదరు మహిళా పోలీస్ పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వటానికి పవన్ కళ్యాణ్ ర్యాలీగా బయలుదేరారు.ఈ విషయాన్ని జనసేన సోషల్ మీడియా విభాగం ప్రకటన ద్వారా తెలియజేసింది.“జన సైనికుడు శ్రీ కొట్టే సాయిపై పోలీసు అధికారిణి విచక్షణా రహిత దాడి ఘటనపై తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు.

విమానాశ్రయంలో పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్( Dr.Pasupuleti Hari Prasad ) పార్టీ నేతలు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ కిరణ్ రాయల్, శ్రీ రాందాస్ చౌదరి, శ్రీ జె.రాజారెడ్డి, శ్రీమతి వినుత కోట, శ్రీమతి అకేపాటి సుభాషిణి, శ్రీ పొన్న యుగంధర్, శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ ముకరం చాంద్, శ్రీ టి.సి వరుణ్, తదితరులు అధినేతకు ఘనస్వాగతం పలికారు.అక్కడి నుంచి పార్టీ నాయకులు, జనసైనికులతో కలసి భారీ ర్యాలీగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి బయలుదేరారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉన్నారు.ఈ పర్యటన సందర్భంగా ఉదయం నుంచే పార్టీ నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు” అనీ జనసేన సోషల్ మీడియా విభాగం ప్రకటన విడుదల చేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...