భగవంత్ కేసరికి బాలీవుడ్ స్ఫూర్తి ?

Date:


నిజమో కాదో తెలియదు కానీ బాలకృష్ణ జైలుకు వెళ్లే ఎపిసోడ్స్, బయటికి వచ్చాక అడుగడుగునా శత్రువులతో ఫైట్ చేసే సన్నివేశాలు దగ్గరి పోలికనైతే చూపిస్తున్నాయి. అప్పట్లో ఇది పెద్ద హిట్టు. పాటలు ఛార్ట్ బస్టర్ అయ్యాయి. తెలుగులో కొండవీటి సింహంగా డబ్బింగ్ చేశారు. అక్టోబర్ మూడో వారంలో దసరా పండక్కు విడుదల కాబోతున్న భగవంత్ కేసరి టైగర్ నాగేశ్వరరావు, లియోలతో పోటీ పడనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ భగవంత్ కేసరి ద్వారా అర్జున్ రామ్ పాల్ టాలీవుడ్ విలన్ గా పరిచయం కాబోతున్నాడు. బిజినెస్ సైతం బాలయ్య కెరీర్ హయ్యెస్ట్ కానుంది. 

తాజాగా ఒక లీక్ ఆసక్తి రేపేలా ఉంది. భగవంత్ కేసరి స్టోరీ లైన్ 1992లో వచ్చిన బాలీవుడ్ మూవీ ఖుదా గవాకు కొంత దగ్గరగా ఉంటుందని  వినికిడి. ఆ సినిమాలో నాగార్జున కూడా నటించారు.  అందులో ప్రేయసికిచ్చిన మాట కోసం శత్రువుని చంపిన అమితాబ్ బచ్చన్ మరో ప్రాణ స్నేహితుడి కోసం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇతనెవరో తెలియకుండానే కూతురు ఇంకో చోట పెరిగి పెద్దవుతుంది. బయటికొచ్చాక ఆమెను కాపాడటమే పెద్ద సవాల్ గా మారుతుంది. ఈ పాత్రను శ్రీదేవి చేసింది. వచ్చిన న్యూస్ ప్రకారం ఈ రెండు పాత్రల్లో బాలయ్య, శ్రీలీల కనిపిస్తారట.

అఖండ, వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్స్ తర్వాత హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న బాలయ్య అభిమానులకు భగవంత్ కేసరి మీద మాములు అంచనాలు లేవు. టీజర్ వచ్చాక రెట్టింపయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ లో కాస్త వయసు మళ్ళిన పాత్రలో బాలకృష్ణ విశ్వరూపం చూస్తారని ఆల్రెడీ టాక్ ఉంది. వరుసగా మూడో ఛాన్స్ కొట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్  హైప్ కు ఏ మాత్రం తగ్గకుండా స్కోర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే కథకు సంబంధించిన క్లూస్ మాత్రం ఇప్పటిదాకా బయటికి రాకుండా టీమ్ జాగ్రత్త పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...