‘బ్రో’ సినిమా కుటుంబమంతా చూడదగ్గ ఫీల్ గుడ్ ఫిల్మ్ అని మూవీ టీం ముందు నుంచి చెబుతోంది. అందుకుతగ్గట్టుగానే బ్రో చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది. ఇక ఈ సినిమా నిడివి కూడా 134 నిమిషాలే. అంటే 2 గంటల 15 నిమిషాల లోపే. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఏమాత్రం పండినా.. ఈ తక్కువ నిడివి, సినిమాకి మరింత లాభం చేకూర్చే అవకాశముంది. పైగా సెన్సార్ సభ్యుల నుంచి కూడా సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు సమాచారం. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత పవన్ నుంచి వస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.