బ్రో & భోళా శంకర్ ఇద్దరికీ ఒకటే సమస్య

Date:


చేతిలో ఉన్న తక్కువ టైంలో బ్రో, భోళా శంకర్ టీంలు ఏదో పబ్లిసిటీ మేజిక్ చేయకపోతే ఇబ్బందులు తప్పేలా లేవు. ఓపెనింగ్స్ వరకు పెద్దగా టెన్షన్ ఉండకపోవచ్చు కానీ న్యూట్రల్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించాలంటే ఎలాంటి ప్రమోషన్ చేస్తున్నామన్నది కీలకంగా మారుతుంది. బ్రోకి టాలీవుడ్ డైరెక్షన్ అనుభవం లేని సముతిరఖని , భోళా శంకర్ కు పదేళ్ల క్రితం దర్శకత్వం మానేసిన మెహర్ రమేష్ పని చేస్తుండటం ఈ ఆందోళనకు మరో కారణం. అన్నింటికన్నా రెండూ రీమేక్ లే కావడం అసలైన మైనస్. కేవలం టూ వీక్స్ గ్యాప్ లో వస్తున్న మెగా బ్రదర్స్ ఫైనల్ గా ఎలాంటి ఫలితం అందుకుంటారో  

ఇక భోళా శంకర్ ది కూడా అదే కథ. పాతిక రోజుల్లో థియేటర్లలోకి రానుంది. మహతి స్వరసాగర్ ఇచ్చిన సాంగ్స్ ఎలాంటి హైప్ ని పెంచలేదు. మొన్నొచ్చిన పార్టీ పాట, అంతకు ముందు టైటిల్ ట్రాక్ చూసేందుకు ఓకే కానీ ఆడియో పరంగా పరమ రొటీన్ గా ఉన్న విషయం అందరూ ఒప్పుకున్నారు. టీజర్ మీద ఆల్రెడీ నెగటివిటీ ఉంది. నిన్న ఊరిద్దామని తాను పవన్ అభిమానిగా నటించానని చిరంజీవి లీక్ చేయడం రివర్స్ లో బూమరాంగ్ అయ్యేలా ఉంది. ఏదో చేయబోయే దాన్ని క్రిన్జ్ కంటెంట్ గా మారుస్తున్నారని ఆ వీడియో చూసిన మూవీ లవర్స్ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు.

మాములుగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల సినిమాలు వస్తున్నప్పుడు వాటి మీద ఉండే హైప్, అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ రెండు మూడు వారాలు ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. కానీ విచిత్రంగా బ్రో, భోళా శంకర్ విషయంలో అదేమీ కనిపించడం లేదు. బ్రో రిలీజ్ కు కేవలం పదకొండు రోజులు మాత్రమే టైం ఉంది. తమన్ రెండు పాటలు విన్నాక స్వయానా అభిమానులే ట్రోలింగ్ చేయడం అబద్దం కాదు. మావయ్య మేనల్లుడు క్రేజీ కాంబినేషన్ లో ఇంత బ్యాడ్ ఆల్బమ్ ఊహించలేదని సోషల్ మీడియాలో వాపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...

సౌందర్య శోభనను మర్చిపోతే ఎలా

దీంట్లో దివంగత సౌందర్య ఒరిజినల్ లో నటించిన శోభనకు ఎంత...