‘బ్రో’ ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్.. గెట్ రెడీ !

Date:

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘బ్రో’ ట్రైలర్ రిలీజ్ కి టైం ఫిక్స్ చేశారు మేకర్స్.

‘బ్రో’ సినిమా ట్రైలర్ ను రేపు(జూలై 22) సాయంత్రం 6:03 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు అధికారకంగా వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ రేపటి కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమా తమిళంలో హిట్ అయిన వినోదయ సీతం కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...