బ్రో టికెట్ రేట్లు బెనిఫిట్ షోలు

Date:


తెలంగాణలో ఎలాగూ గరిష్ట ధర 295 అమలులో ఉంది కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు కానీ ఆంధ్రాలో మాత్రం  హ్యాపీగా 177 రూపాయలకే ఫస్ట్ డే పవన్ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని బట్టి కలెక్షన్లు ఓపెనింగ్స్ పరంగా రికార్డులు బద్దలు కావడం లాంటివి ఎంత మేరకు జరుగుతాయో వేచి చూడాలి. పోటీగా ఇంకే సినిమాలు లేవు కాబట్టి మాములు రేట్లతోనే బెంచ్ మార్కులు సెట్ చేస్తానని పవన్ ఇంతకు ముందు వకీల్ సాబ్ లాంటి వాటితో నిరూపించారు. సో బ్రోకు కూడా పాజిటివ్ టాక్ వస్తే ఈసారి కూడా సెన్సేషన్స్ జరగొచ్చు. థియేటర్ కౌంట్ కూడా పెద్దగానే ఉండబోతోంది.

ఇక టికెట్ రేట్లకు సంబంధించి నిర్మాత టిజి విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చేశారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ తాము ఎలాంటి పెంపుని కోరడం లేదని, అనుకున్న బడ్జెట్ లోనే కంట్రోల్ గా తీశాం కాబట్టి బయ్యర్లకు నష్టం వచ్చే అవకాశం లేకుండా బిజినెస్ చేశామని చెప్పారు. అంతేకాదు బెనిఫిట్ షోలకు పర్మిషన్లు కూడా పెట్టలేదన్నారు. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్లు కనక స్వంతంగా అప్పీల్ చేసుకుంటే ఛాన్స్ ఉండొచ్చు కానీ ఆయనగా ఆ మాట చెప్పలేదు. ఎక్స్ ట్రా షోలు లేవన్నారు కాబట్టి ఉదయం 7 కన్నా ముందు ప్రీమియర్లు పడే అవకాశం దాదాపు లేనట్టే.

ఇంకో ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న బ్రో కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా పవర్ స్టార్ మూవీ వస్తున్నప్పుడు కనిపించే హంగామా ఆ స్థాయిలో లేదు కానీ ఈసారి కొంత తక్కువగా ఉన్న మాట వాస్తవం. వినోదయ సితం రీమేక్ కావడంతో పాటు తమన్ ఇచ్చిన రెండు పాటలకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాకపోవడం కొంత ప్రభావాన్ని చూపిస్తోంది. వీటి సంగతి ఎలా ఉన్నా రిలీజ్ రోజు సందడి మాములుగా ఉండదు. అందులోనూ భీమ్లా నాయక్ వచ్చి ఏడాది దాటిపోవడంతో ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి టెన్షన్లు అక్కర్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి దిశగా సింగరేణి –

– సాధ్యాసాధ్యాలపై నివేదికలు ఇవ్వండి : ఉన్నతాధికారులకు సీఎమ్‌డీ అదేశాలునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోసింగరేణి...

మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన –

– ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి– రోడ్లు ఊడ్చిన ఆశాలునవతెలంగాణ- విలేకరులుసమస్యలను...

కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

–  రాష్ట్ర ఉన్నత విద్యామండలి భవనం ముందు కాంట్రాక్ట్‌ లెక్చరర్ల...

పథకాల అమలులో చిత్తశుద్ధి లేదు –

– ఓట్ల కోసం ప్రజాధనం దుర్వినియోగం– ఎమ్మెల్యే వ్యాఖ్యలు అహంకారానికి...