బేబీ ప్రీమియర్లకు ఇంత స్పందనా

Date:


రేపెలాగూ చెప్పుకోదగ్గ పోటీనే ఉంది కాబట్టి వేరే సినిమాల మార్నింగ్ షోలు మొదలయ్యే లోపు బేబీ రిపోర్ట్ కనక రాత్రే పాజిటివ్ గా వస్తే దాని ప్రభావం టికెట్ కౌంటర్ల దగ్గర సానుకూలంగా ఉంటుంది. ఎలాగూ మిషన్ ఇంపాజిబుల్ 7 మరీ భయపెట్టే రేంజ్ లో టాక్ తెచ్చుకోలేదు కనక బేబీ కాంపిటీషన్ మహావీరుడు, నాయకుడులతోనే ఉంది. కానీ అవి రెండు పబ్లిసిటీని పూర్తిగా పక్కనపెట్టేసిన డబ్బింగ్ చిత్రాలు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వైష్ణవి చైతన్య టైటిల్ రోల్ పోషించిన బేబీ హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లకు సైతం చాలా అవసరమైన హిట్టే. ఉదయానికి రిజల్ట్ తెలిసిపోతుంది 

పాటలు యూత్ లో బాగా వెళ్లాయి. ముఖ్యంగా ఓ రెండు మేఘాలిలా ఛార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా, దేవరాయలు స్లోగా ఎక్కేశాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ట్రెండ్స్ పట్ల నిర్మాత ఎస్కెఎన్, దర్శకుడు సాయి రాజేష్ మంచి ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. ముందు రోజు ప్రీమియర్ల సెంటిమెంట్ ఈ మధ్య బాగానే వర్కౌట్ అవుతోంది. సామజవరగమన, మేం ఫేమస్, రైటర్ పద్మభూషణ్ లాంటివి ఈ స్ట్రాటజీ వల్లే వర్కౌట్ అయ్యాయి. రంగబలి మాత్రమే  తేడా కొట్టింది. కానీ బేబీ విషయంలో కనిపిస్తున్న ఉత్సాహం ఇక్కడ చెప్పినవాటి కంటే కొంత ఎక్కువే ఉంది.

ఇవాళ సాయంత్రం 8 గంటలతో మొదలుపెట్టి ఏపీ, తెలంగాణలోని కీలక కేంద్రాల్లో బేబీ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి నగరాలతో పాటు మదనపల్లె, కర్నూలు, కడప లాంటి పట్టణాల్లోనూ వీటిని ప్లాన్ చేశారు. అనూహ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ బాగుండటం విశేషం. అసలు విడుదల తేదీ రేపు ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడుపోలేదు. ఈ స్పెషల్ షోల టాక్స్ ని బట్టే వాటి ఎదుగుదల ఆధారపడి ఉంది. అసలు స్టార్ క్యాస్టింగే లేని బేబీ పట్ల జనంలో ఇంత హైప్ ఉందంటే దానికి ప్రధాన కారణం సంగీతమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రొడ్యూస‌ర్‌కి ఎన్టీఆర్ సహాయం!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది. ప‌వ‌న్...

పర్మినెంట్‌ చేయాల్సిందే చిన్నచూపు చూస్తే వదలబోం

– సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మె...

రాష్ట్రంలో బీసీ గణన చేయండి –

– సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టండి– సీఎం కేసీఆర్‌కు...