బేబి.. మ‌రో స్ట‌న్నింగ్ మైల్ స్టోన్

Date:


అస‌లు బేబి లాంటి చిన్న సినిమా ఫుల్ ర‌న్లో 50 కోట్ల‌కు చేరువ‌గా వ‌స్తుంద‌ని కూడా ఎవ‌రూ ఊహించ‌లేదు. అలాంటిది వారం రోజుల్లో 50  కోట్లంటే ఆషామాషీ విష‌యం కాదు. ఈ సినిమా రెండో వీకెండ్లో కూడా బాక్సాఫీస్ లీడ‌ర్‌గా నిలుస్తోంది. ఈ వారం వ‌చ్చిన తెలుగు సినిమాలేవీ దాని ముందు నిల‌బ‌డే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. బ్రో మూవీ వ‌చ్చేలోపు ఇంకో 20 కోట్లకు త‌క్కువ కాకుండా ఆ సినిమా క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

మూడు రోజులుగా కురుస్తున్న వ‌ర్షాలు కూడా మ‌రీ ప్ర‌భావం ఏమీ చూపించ‌ట్లేదు బేబి మూవీ మీద‌. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ముందుకు సాగుతోంది. వారం రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల మైలురాయిని అందుకోవ‌డం విశేషం. స్టార్ హీరోలు న‌టించ‌ని మిడ్ రేంజ్ చిత్రాల్లో ఇంత వేగంగా మ‌రే సినిమా కూడా ఈ మైలురాయిని అందుకోలేదు.

వీకెండ్లో ఆ చిత్రం వ‌సూళ్ల మోత మోగించి.. మూడో రోజుకే దాదాపుగా అంద‌రు బ‌య్య‌ర్ల‌నూ సేఫ్ జోన్లోకి తెచ్చేసింది. అక్క‌డి నుంచి బ‌య్య‌ర్ల‌కు వ‌స్తున్న‌దంతా లాభ‌మే. అప్ప‌టికే సినిమాను మంచి లాభాల‌కు అమ్ముకున్న నిర్మాత‌ల‌కు.. ఓవ‌ర్ ఫ్లోస్ రూపంలోనూ మ‌రింత ఆదాయం వ‌చ్చేలా క‌నిపిస్తోంది. బేబి వీకెండ్ త‌ర్వాత కూడా ఏమాత్రం వీక్ అవ్వ‌కుండా హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అవ‌డం చూసి ట్రేడ్ వ‌ర్గాలు షాక్ అయ్యాయి.

వారం కింద‌ట విడుద‌లైన బేబి అనే చిన్న సినిమా రిలీజ్ ముందు రోజు ప్రిమియ‌ర్స్ నుంచే సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ చిత్రానికి పెద్ద సంఖ్య‌లో పెయిడ్ ప్రిమియ‌ర్స్ వేస్తే.. అవ‌న్నీ కూడా హౌస్ ఫుల్ అయిపోయాయి. ఇక రిలీజ్ రోజు అయితే బేబి థియేట‌ర్ల‌లో మామూలు సంద‌డి లేదు. ఒక చిన్న సినిమాకు తొలి రోజు ఇలాంటి సంద‌డి అరుదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

నిన్న కృతి, నేడు శ్రీలీల.. మూన్నాళ్ళ ముచ్చటేనా!

'పెళ్లి సందడి'తో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల 'ధమాకా'తో బ్లాక్...

బన్నీ కన్నా ముందు త్రివిక్రమ్ మరో సినిమా?

డివివి దానయ్య నిర్మాతగా ఈ కాంబో ఎప్పుడో సెట్ కావాల్సి...

‘సలార్’ పార్ట్1 లో ఎన్టీఆర్!

ప్ర‌భాస్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన స‌లార్ మూవీ ఎప్పుడో రావాల్సింది....