బేబి కోసం పెద్దోళ్లు దిగారు

Date:


ద‌ర్శ‌కుడు సాయిరాజేష్‌కు కూడా ఆయ‌న కాల్ చేసి చాలాసేపు మాట్లాడాడ‌ట‌. అంతే కాక అల్లు అర్జున్ బుధ‌వారమే ఈ సినిమా చూసి.. ద‌ర్శ‌కుడు సాయి రాజేష్‌ను క‌లిసి అభినందించ‌డ‌మే కాక‌.. గురువారం అప్రిషియేష‌న్ మీట్ అంటూ ప్ర‌త్యేక‌మైన కార్య‌క్ర‌మానికి కూడా రాబోతున్నాడు. ఇదంతా బేబి ప్ర‌మోష‌న్ల‌కు బాగా క‌లిసొస్తుంద‌ని వేరే చెప్పాల్సిన ప‌ని లేదు.

ఇది కాక సినిమాకు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల స‌పోర్ట్ కూడా ద‌క్కుతోంది బేబి మూవీకి. చిత్ర బృందం కూడా వ్యూహాత్మ‌కంగానే ఈ స‌పోర్ట్‌ను సినిమా ప్ర‌మోష‌న్‌కు ఉప‌యోగించుకుంటోంది. బుధ‌వారం అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ బేబి మీద ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ ఫేస్ బుక్ పోస్టు పెట్టాడు. చాలా కాలం తర్వాత‌ ఒక అసాధారణమైన రైటింగ్‌ను బేబి మూవీలో చూశాన‌ని.. ఈ సినిమా ఒక కొత్త ఒరవడిని, పంథాను తీసుకొస్తుంద‌ని… ప్రతి సన్నివేశం త‌న‌కు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపించిందని.. ఒక సినిమాలో సిట్యుయేషన్‌ను కూడా పాత్రల తరహాలో ఈ సినిమాలోనే తొలిసారి చూశాన‌ని పేర్కొంటూ ద‌ర్శ‌కుడు సాయి రాజేష్‌తో పాటు ముఖ్య పాత్ర‌లు పోషించిన వైష్ణ‌వి, ఆనంద్ దేవ‌ర‌కొండ‌, విరాజ్ అశ్విన్‌లను కొనియాడాడు సుక్కు.

వ‌ర్షం కొంత ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతోంది కానీ.. అయినా వ‌సూళ్లు బాగానే ఉన్నాయి. సినిమాకు లాంగ్ ర‌న్ తీసుకురావాల‌న్న ఉద్దేశంతో వీక్ డేస్‌లో ప్ర‌మోహ‌న్ల జోరు పెంచుతోంది టీం. ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖ్య అతిథిగా స‌క్సెస్ సెల‌బ్రేష‌న్ ఈవెంట్ చేశారు. ద‌ర్శ‌కుడు సాయి రాజేష్ మీడియాను క‌లిసి ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు.

పెద్ద‌గా ప‌బ్లిసిటీ ఏమీ లేకుండానే.. కేవ‌లం టీజ‌ర్, ట్రైల‌ర్, పాట‌ల‌తోనే ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించి రిలీజ్ ముంగిట మంచి హైప్ తెచ్చ‌కుంది బేబి సినిమా. ఆ చిత్రానికి పెయిడ్ ప్రిమియ‌ర్స్ నుంచి అనూహ్య‌మైన స్థాయిలో వ‌సూళ్లు వ‌చ్చాయి. వీకెండ్ అయితే ఆ సినిమా స్థాయికి, వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌కు అస‌లు పొంత‌న లేదు. పెద్ద సినిమాలు సైతం వీకెండ్ త‌ర్వాత డౌన్ అయిపోతుంటాయి కానీ.. బేబి మాత్రం వీక్ డేస్‌లోనూ క‌లెక్ష‌న్లు కుమ్మేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ...

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...