2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జాతీయ రాజకీయాలు వేడెక్కాయి.ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలనే పట్టుదలతో విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి.
ఎవరికి వారు పోటీ చేస్తే మళ్ళీ బీజేపీ( BJP ) గెలుపు తథ్యం అని విపక్షాలు కూడా భావించి ఐక్య మంత్రాన్ని జపిస్తున్నాయి.గత నెలలో పాట్నాలో జరిగిన విపక్ష పార్టీల సమావేశం గట్టిగానే సక్సస్ అయింది.
దాదాపు 25 పార్టీల దాకా ఆ సమావేశంలో పాల్గొన్నాయి.ఆ సమావేశం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్( Nithish kumar ) నేతృత్వంలో జరిగినప్పటికి.
ప్రధాన పాత్ర మాత్రం కాంగ్రెస్ పార్టీనే పోషించిందని చెప్పవచ్చు.

ఇక రెండవ సమావేశంగా నేడు డిల్లీలో( delhi ) మరోసారి విపక్షాలు భేటీ అయ్యాయి.ఈ సమావేశంలో కూడా 22 నుంచి 25 పార్టీలు హాజరైనట్లు తెలుస్తోంది.ఈ సమావేశంలో విపక్షాల తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది.
విపక్షాల తరుపున ఎవరిని సిఎం అభ్యర్థిగా నియమించాలి అనే దానిపై చర్చించే అవకాశం ఉంది.అయితే విపక్షాల సమావేశాన్ని లైట్ తీసుకుంటున్నట్లు కాషాయ పెద్దలు చెబుతున్నప్పటికి లోలోపల అప్రమత్తం అవుతున్నట్టే తెలుస్తోంది.
నేడు విపక్షాలతో కాంగ్రెస్ సమావేశం అవుతుంటే రేపు అనగా 18న ఎన్డీయే మిత్రపక్షాలతో బీజేపీ సమావేశం కానుంది.

దీన్ని బట్టి విపక్షాల ఐక్యత విషయంలో బీజేపీ అలెర్ట్ అవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.దాదాపు ముప్పై మిత్రపక్ష పార్టీల అధినేతలకు బీజేపీ పెద్దలు ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది.దీంతో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నిర్వహిస్తున్న సమావేశాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
కాగా విపక్షాల భయంతోనే బీజేపీ హటాత్తుగా ఎన్డీయే మిత్రపక్ష కూటమిని ఏర్పాటు చేసిందా అంటే అవునేమో అనే వ్యక్తమౌతున్నాయి.ఎందుకంటే 2019 ఎన్నికల తరువాత చాలానే పార్టీలు ఎన్డీయే( NDA ) నుంచి బయటకు వచ్చాయి.
దాంతో ఆ ప్రస్తుతం ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపే పార్టీలు ఏవనే క్లారిటీ కోసం అలాగే విపక్షాల ఐక్యతను తిప్పికొట్టేందుకు తదుపరి వ్యహరచన కోసం ఈ సమావేశాన్ని బీజేపీ పెద్దలు నిర్వహించినట్లు తెలుస్తోంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.
