బిజినెస్ మెన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు  

Date:


ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ తీసిన బిజినెస్ మెన్ చాలా తక్కువ టైంలో షూటింగ్ పూర్తి చేసుకున్న స్టార్ మూవీగా అప్పట్లో టాక్ అఫ్ ది మీడియాగా నిలిచింది. డైలాగులు, తమన్ పాటలు, మహేష్ ఎనర్జీ ఒకటేమిటి అన్ని అంశాలు దీని రేంజ్ లో ఎక్కడికో తీసుకెళ్లాయి. పోకిరి రేంజ్ లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టకపోయినా కమర్షియల్ గా ఆ ఏడాది అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. అందుకే సూర్య భాయ్ ఆగమనాన్ని భారీ హడావిడితో స్వాగతం చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఈ ఉత్సాహం చూస్తుంటే అనుకున్నది సాధించేలానే ఉన్నారు.

ఇప్పటిదాకా వచ్చిన రీరిలీజుల రికార్డులు పోకిరి , జల్సా, ఖుషి, ఆరంజ్ పేరు మీద ఉన్నాయి. వీటిని ఎలా అయినా క్రాస్ చేసి బిజినెస్ మెన్ ని నెంబర్ వన్ గా నిలబెట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. సోషల్ మీడియా ప్రమోషన్లు ప్రత్యేకంగా చేస్తున్నారు. టి షర్టులు, క్యాపులు, జర్కిన్లు, స్టిక్కర్లు, స్టాంపులు అన్నీ ఆ సినిమాకు సంబంధించి స్టిల్స్ తో తయారు చేయించి ఆన్ లైన్ ద్వారా అభిమానులకు చేరేలా చేస్తున్నారు. ఆ టైంలో పెద్దగా చెప్పుకునే కొత్త సినిమాలు లేవు. 10న జైలర్, 11న భోళా శంకర్ వస్తుంది కాబట్టి ఒక్క రోజులోనే రికార్డులు సెట్ చేయాలనేది మహేష్ సైన్యం టార్గెట్.

ఇంకో పది రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రాబోతోంది. గుంటూరు కారం ట్రైలర్ వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. కనీసం ఆడియో సింగల్ అయినా వస్తుందేమో అనుకుంటే అసలు తమన్ ట్యూన్ కంపోజ్ చేసి ఇచ్చారో లేదో కూడా తెలియదు. మరోవైపు హీరో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ హాలిడేకి వెళ్లిపోయారు. త్రివిక్రమ్ బృందం ఏం ఆలోచిస్తోందో కొంచెం కూడా బయటికి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకోవడానికి కంటెంట్ కావాలి. అందుకే ఆగస్ట్ 9న బ్లాక్ బస్టర్ మూవీ బిజినెస్ మెన్ గ్రాండ్ రీ రిలీజ్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...