బాలయ్య ధాటిని విజయ్ తట్టుకోగలడా

Date:


లియోకి సంబంధించి ప్రధానమైన సెల్లింగ్ ఫ్యాక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ విక్రమ్ ని హ్యాండిల్ చేసిన తీరు, దానికి తెలుగు రాష్ట్రాల్లో దక్కిన ఆదరణ బ్రాండ్ వేల్యూని పెంచింది. అంతమాత్రాన ఒకేసారి డబుల్ ట్రిపుల్ అయ్యిందని కాదు. అయినా సరే సితార అంత మొత్తానికి సిద్ధపడిందంటే ప్లాన్ పెద్దదే ఉంది. ఇదిలా ఉంటే రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా 20న దిగుతున్నాడు. తేదీలో ఎలాంటి మార్పు ఉండదని యూనిట్ అంటోంది. మరి బాలయ్య, మాస్ మహారాజాలను కాచుకోవడం అసలు ప్రమోషన్లకే రాని విజయ్ కి పెద్ద సవాళ్ళే తీసుకురావడం పక్కా. 

ఇదంతా బాగానే ఉంది కానీ బాలయ్యని ఫేస్ చేయడం విజయ్ కు అంత సులభంగా ఉండదు. ఎందుకంటే బిసి మాస్ సెంటర్స్ లో పట్టున్న నందమూరి సీనియర్ హీరోతో తలపడటం కమర్షియల్ కోణంలో రిస్కే. పైగా అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి దర్శకుడు. కళ్యాణ్ రామ్ నే పటాస్ లో ఊర మాస్ గా చూపించి మెప్పించిన ట్రాక్ రికార్డు తనది. సో ఈ కాంబో అంటే బయ్యర్లలో సహజంగానే విపరీతమైన క్రేజ్ నెలకొంది. పైగా శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రామ్ పాల్, తమన్ లాంటి ఆకర్షణీయమైన టీమ్ ఎలాగూ ఉంది. ట్రైలర్ వచ్చాక హైప్ రెట్టింపవుతుంది.

బాలకృష్ణ భగవంత్ కేసరి విడుదల అక్టోబర్ 19కి లాక్ చేస్తూ  యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ముందు అనుకున్న తేదీ కన్నా ఒక రోజు ముందుకు జరిగింది. అదే రోజు విజయ్ లియో ఆల్రెడీ కర్చీఫ్ వేసింది. సితార సంస్థ 21 కోట్ల భారీ మొత్తానికి దీన్ని కొన్నట్టు వచ్చిన వార్త ఆల్రెడీ వైరల్ అయ్యింది. ఎంత ఇమేజ్ ఉన్నా విజయ్ స్టామినా టాలీవుడ్ వరకు పరిమితంగానే ఉంటూ వస్తోంది. ఒకప్పుడు బొటాబొటీగా ఉండేది కానీ తుపాకీ నుంచి క్రమంగా పెరుగుతూ పోయింది. రొటీన్ సినిమాలు సైతం బాగానే డబ్బులు తెచ్చేంత సేఫ్ జోన్ లోకి ఎప్పుడో వెళ్ళిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...