బన్నీ అంటే బ్రహ్మాజీ కొడుక్కి ఇంత పిచ్చా 

Date:


ఇక బన్నీ పుష్ప ఘాట్ లో ‘స్లమ్ డాగ్ హస్బండ్’ ట్రైలర్ చూసి నాన్నతో అదిరిపోయిందని చెప్పి ఫహాద్ ఫాసిల్ ను కూడా ట్రైలర్ చూడామని చెప్పాడని ఆ విషయం విన్నప్పుడు ఎంతో సంతోష పడ్డానని సంజయ్ తన ఫీలింగ్ బయట పెట్టాడు. ఇటీవలే ధోనీ భార్య తను అల్లు అర్జున్ ఫ్యాన్ అంటూ చెప్పుకుంది. ఇప్పుడు బ్రహ్మాజీ కొడుకు తన ఫ్యానిజంను గిఫ్ట్ తో బయట పెట్టాడు. దీంతో పుష్ప2 అప్ డేట్స్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఇవన్నీ వాటిని మర్చిపోయేలా చేస్తున్నాయి.

తాజాగా సంజయ్ ఓ ఇంటర్వ్యూలో తనకి బన్నీ అంటే ఎంత ఇష్టమో బయటపెట్టాడు. “బన్నీని చూసే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. ఆయనలాగా కష్టపడి పైకి రావాలని ఉంది. బన్నీ జర్నీ నాకు తెలుసు. ఒక పెద్ద నిర్మాత కొడుకు.. ఈజీగా దొరికి ఉంటుందని బయట అందరూ అనుకుంటారు. కానీ లోపల వేరు. ఆయన పడే కష్టం మా నాన్న నాకు రోజు చెబుతూ ఉంటారు. ఇవాళ బన్నీ ఆఫీసు ముందు వెళ్లి ఓ గిఫ్ట్ అన్నకు ఇవ్వమని వాళ్ల అసిస్టెంట్‌కు ఇచ్చి వచ్చా. మళ్లీ రేపు వెళ్లి కలుస్తా” అంటూ చెప్పుకున్నాడు సంజయ్. దీంతో బ్రహ్మాజీ కొడుకుకి బన్నీ అంటే ఇంత పిచ్చా ? అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. 

మొదట హీరోగా , తర్వాత కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు ను హీరోగా ఇండస్ట్రీకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సంజయ్ ఓ పిట్ట కథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు రెండో సినిమా స్లమ్ డాగ్ హస్బండ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి బ్రహ్మాజీ తన పరిచయాలతో కొంత బజ్ తీసుకొచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుకుమార్ , శ్రీ లీల ను ఇన్వైట్ చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రొడ్యూస‌ర్‌కి ఎన్టీఆర్ సహాయం!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది. ప‌వ‌న్...

పర్మినెంట్‌ చేయాల్సిందే చిన్నచూపు చూస్తే వదలబోం

– సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మె...