మారుతున్న కాలానికి అనుగుణంగా జనాల జేబులకు, అధికారుల కళ్ళకు గంతలు కట్టడానికి కొందరు ప్రబుద్ధులు ప్రయత్నిస్తున్నారు.ఈ విషయాన్ని పసిగట్టిన అధికారులు చాకచక్యంగా వ్యవహరిస్తూ వాళ్ళను ఊచలు లెక్కపెట్టిస్తున్నారు.తాజాగా జరిగిన ఇలాంటి ఓ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.దానిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
దుబాయ్ షార్జా నుండి చెన్నైకి చేరుకున్న ఎనిమిది మంది వద్ద కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 4.15 కిలలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ బంగారాన్ని నిందితులు మాత్రలుగా మార్చి వాటిని సూర్య సినిమాలో లాగా పొట్టలో ఉంచుకొని తరలిస్తున్నారు.దీని గుర్తించిన కస్టమ్స్ అధికారులు. వైద్యుల పరివేక్షణలో
నిందితుల పొట్టల నుండి బంగారాన్ని బయటికి తీశారు.వీరి నుండి స్వాధీనం చేసుకున్న బంగారం ధర 2.17 కోట్లు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేశారు.
ఇది చూసిన సామాన్యులు సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి అలాకాకుండా వాటిని నిజజీవితంలో రిపీట్ చేస్తాం అంటే ఇలాగే అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ న్యూస్ పై మీరేం అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.