“నేను మా అమ్మగారికి ఫోన్ చేసిన ప్రతీసారి ఆమె నా పెళ్లి గురించి అడుగుతుంది. పెళ్లెప్పుడు చేసుకుంటావనే ప్రశ్నను నేను ఆమె నుంచి తరుచుగా వినాల్సి వస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే మా కమ్యూనిటీలో 16 ఏళ్లకే అబ్బాయిలకు పెళ్లి చేస్తారు. కాబట్టి నా కుటుంబం వైపు నుంచి ఒత్తిడి ఉండటం ఖాయం. మా అమ్మ నా పెళ్లి గురించి ప్రశ్నించినప్పుడంతా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ ఉంటాను. అందుకు కారణం ఇప్పుడు నా కెరీర్ సాఫీగా సాగిపోతుంది. ప్రస్తుతం నా కెరీర్‌పైనే దృష్టి పెట్టాను“ అన్నారు విజయ్ వర్మ. మరి ఈ యాక్టర్ తల్లి కోరికను ఎప్పుడు నేరవేరుస్తాడో మరి చూడాలిక.