- శభాష్ సేటు…!!
- ప్లాస్టిక్ కవర్ల నిషేధం పట్ల మంత్రి హరిశ్ రావు ఖుష్..!!
- శ్రీ కృష్ణ కిరాణ షాప్ భేష్….!ఇదే స్ఫూర్తి పట్టణమంత విస్తరించాలి….
” ప్లాస్టిక్ వల్ల అనేక రుగ్మతలు వస్తున్నాయని ప్లాస్టిక్ కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలంటూ మంత్రి హరీష్ రావు గారు తరుచూ చెబుతుండటం తో స్ఫూర్తి పొందిన పట్టణంలోని కిరాణా దుకాణం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించింది . పట్టణ మెదక్ రోడ్ లోని రైతు బజార్ ఎదురుగా ఉన్న శ్రీ కృష్ణ కిరాణ షాప్ లో గత కొంత కాలంగా ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నిషేదించి, అన్ని సరుకులను కూడా కాగితం, బట్ట సంచుల్లోనే ఇస్తూ వస్తున్నారు. సోమవారం నాడు రైతు బజార్ కు అనుబంధం గా ఏర్పాటు చేసిన మనవత్వపు గదిని పరిశీలించారు. ఈ సందర్భంలో ఎదురుగా ఉన్న కిరాణ దుకాణంలో ప్లాస్టిక్ ను వాడటం లేదని తెలుసుకుని మంత్రి స్వయంగా కిరాణా దుకాణాన్ని పరిశీలించారు. కిరాణా దుకాణం లో అన్ని సరుకులను కూడా కాగితం, బట్ట సంచుల్లోనే ప్యాక్ చేయటాన్ని గమనించి శభాష్ సెటు అంటూ భాస్కర్ సేటును అభినందించారు. ప్లాస్టిక్ కవర్ల నిషేధం పట్ల మంత్రి హరిశ్ రావు ఖుషి అయ్యారు .!! శ్రీ కృష్ణ కిరాణ షాప్ భేష్ అని ఇదే స్ఫూర్తి పట్టణమంత విస్తరించాలి ఈ సందర్భంగా అన్నారు..