ప్రాజెక్ట్ కే.. ఏముంది ఆ కవర్లో?

Date:


దీంతో ఇంతకీ ఆ కవర్లో ఏముందనే ఆసక్తి నెటిజన్లలో నెలకొంది. బహుశా ‘ప్రాజెక్ట్-కే’లో ‘కే’ అంటే ఏంటో చెప్పే పదం ఆ కవర్లో ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందులో ‘కే’ అంటే ‘కాలచక్ర’.. సినిమాలో హీరో చేపట్టే మిషన్ పేరే ‘ప్రాజెక్ట్-కాలచక్ర’ అని.. కాలంలో ప్రయాణం చేసి ప్రపంచాన్ని రక్షించడానికి హీరో చేసే పోరాటమే ఈ సినిమా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ నెల 20న ‘ప్రాజెక్ట్-కే’ టీం ప్రేక్షకులు ఏం వెల్లడించబోతోందో చూడాలి.

ఈ సందర్భంగా ‘ప్రాజెక్ట్-కే’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టాడు సోషల్ మీడియాలో. ఒక కవర్.. దాని మీద రోజ్ పెట్టిన ఫొటోను అతను షేర్ చేసి.. ‘‘ఈ కవర్లో ఒక పేపర్ ఉంది. అందులో ఒక్క పదం మాత్రమే ప్రింట్ చేసి ఉంది. కానీ అది మోసే బరువు మాత్రం చాలా ఎక్కువ. దాదాపుగా ఒక ప్రపంచమంత’’ అని కామెంట్ జోడించి ‘ప్రాజెక్ట్-కే’ హ్యాష్ ట్యాగ్ జోడించాడు నాగ్ అశ్విన్.

కొన్ని రోజులుగా ‘ప్రాజెక్ట్-కే’ మెర్చండైజ్ అమ్మకాలు జరుపుతున్న చిత్ర బృందం ఈ నెల 20న ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశారు. సినిమా మొదలై ఏడాది దాటినా ఇప్పటిదాకా ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేయలేదు చిత్ర బృందం. ఇప్పుడు ఒకేసారి ఫస్ట్ లుక్‌తో పాటు చిన్న వీడియో కూడా వదలబోతున్నారు. అంతే కాక ‘ప్రాజెక్ట్-కే’లో ‘కే’ అంటే ఏంటో కూడా వెల్లడించబోతున్నారు.

ఇండియాస్ కాస్ట్లీయెస్ట్ ఫిలిం ఘనతను టాలీవుడ్‌కు కట్టబెట్టబోతోంది ‘ప్రాజెక్ట్-కే’ మూవీ. ఈ సినిమా మీద ఉన్న అంచనాల ప్రకారం చూస్తే.. అన్నీ కలిసొస్తే ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ అయ్యే అవకాశాలను కూడా కొట్టి పారేయలేం. ‘ప్రాజెక్ట్-కే’ రిలీజ్ విషయంలో సందిగ్ధత నెలకొన్నప్పటికీ.. చిత్ర బృందం ఆ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా ఇప్పట్నుంచే ప్రమోషన్ల హడావుడిలో పడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...