ప్రధాని మోడీపై అశోగ్ గెహ్లాట్ మండిపాటు

Date:

ప్రధాని నరేంద్రమోడీపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్రాల్లోనే నరేంద్రమోడీ పర్యటిస్తున్నారని, మణిపుర్ రాష్ట్రంలో ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. మణిపుర్ రాష్ట్రం మంటల్లో మండుతున్నా ప్రధాని మోడీ అస్సలు పట్టించుకోవడం లేదని అశోక్ గెహ్లాట్ విమర్శించారు. ఇటువంటి ప్రధానిని ఇదే మొదటిసారి చూడడం అని అశోక్ గెహ్లాట్ ఆశ్యర్యం వ్యక్తం చేశారు.

కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు ఎన్నికలున్న ఇతర రాష్ట్రాల్లో నరేంద్రమోడీ పర్యటించారు గానీ, మణిపుర్ లో పర్యటించలేదని మండిపడ్డారు. మణిపుర్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉందని గెహ్లాట్ గుర్తుచేశారు. ఒకవేళ మణిపుర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మోడీ ఏ విధంగా స్పందించేవారో ఊహించుకోవచ్చని గెహ్లాట్ అన్నారు.

అయితే మణిపుర్ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బహిర్గతం అయిన సందర్భంగా స్పందించిన నరేంద్ర మోడీ రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో శాంతి భద్రతల విషయాన్ని ప్రస్తావించారు. ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రులు అప్రమత్తంగా ఉండాలని మోడీ చురకలు వేశారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలను అశోక్ గెహ్లాట్ తీవ్రంగా ఖండించారు. మోడీ వ్యాఖ్యలు రాజస్థాన్ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని గెహ్లా్ట్ మండిపడ్డారు.

మణిపుర్ విషయంలో నరేంద్రమోడీ స్పందిస్తున్న తీరుపై అశోక్ గెహ్లాట్ అసహనం వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా మణిపుర్ మండుతుంటే సమీక్ష చేసే తీరిక కూడా మోడీకి లేకుండా పోయిందని మండిపడ్డారు. మణిపుర్ రాష్ట్రంలో పర్యటించకపోయినా.. కనీసంలో కనీసం అక్కడి పరిస్థితులను అధికారులతోగానీ, మంత్రులతో గానీ సమీక్ష చేపట్టాల్సి ఉందని అశోక్ గెహ్లాట్ అభిప్రాయపడ్డారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రొడ్యూస‌ర్‌కి ఎన్టీఆర్ సహాయం!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మూడో చిత్ర‌మిది. ప‌వ‌న్...

పర్మినెంట్‌ చేయాల్సిందే చిన్నచూపు చూస్తే వదలబోం

– సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మె...

రాష్ట్రంలో బీసీ గణన చేయండి –

– సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టండి– సీఎం కేసీఆర్‌కు...