ఇప్పుడు అదే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాకేష్ వర్రే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ‘పేకమేడలు’ అనే నూతన చిత్రాన్ని నిర్మించి విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా ‘నా పేరు శివ’, ‘అందగారం’ వంటి చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్, నూతన నటి అనూష కృష్ణ తెలుగు తెరకి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. వారితో పాటూ ఈ చిత్రానికి 50 మంది నూతన నటీ నటులతో పాటు ఎంతో ప్రతిభావంతులైన టెక్నిషన్స్ పని చేసారు. ‘అంగమలి డైరీస్’, ‘జల్లికట్టు’ వంటి చిత్రాలకు సౌండ్ డిజైన్ అందజేసిన ప్రముఖ సౌండ్ డిజైనర్ రంగనాధ్ రేవి, సౌండ్ మిక్సర్ కన్నన్ గన్ పత్ ఈ చిత్రానికి పని చేసారు.