పెళ్లి కోసం ప్రేమ్ కుమార్ తిప్పలు

Date:


తన బలమైన ఎంటర్ టైన్మెంట్ నే సంతోష్ శోభన్ నమ్ముకున్నాడు. సీన్లు గట్రా కామెడీగానే అనిపిస్తున్నాయి. కాన్సెప్ట్ మొత్తం పెళ్లి చుట్టే నడిపించారు. అభిషేక్ మహర్షి పెన్నులో వినోదం పాళ్ళు గట్టిగానే ఉన్నాయనిపిస్తోంది. స్పై దర్శకుడు గ్యారీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా అనంత్ శ్రీకర్ సంగీతం సమకూర్చారు. అంతా బాగానే ఉంది కానీ కేవలం వారం గ్యాప్ తో చిరంజీవి, రజనీకాంత్ లాంటి పెద్ద సినిమాల పోటీలో దిగుతున్న ప్రేమ్ కుమార్ భారీ రిస్కే చేస్తున్నాడు. కంటెంట్ మీద నమ్మకం బలంగా ఉంది కాబోలు. ఆగస్ట్ 18న థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది.

కథేంటో స్పష్టంగా ఓపెన్ చేశారు. ప్రేమ్ కుమార్(సంతోష్ శోభన్) ఎంత ప్రయత్నించి చూస్తున్నా ఒప్పుకున్న ప్రతి సంబంధం పీటల దాకా వచ్చి ఆగిపోతుంది. పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుందంటే టీవీ ఛానల్స్ వచ్చి ఇంటర్వ్యూ  చేసేంత. దీంతో విసుగెత్తిపోయిన ప్రేమ్ కుమార్ అలియాస్ పీకే ఒక బిజినెస్ పెడతాడు. బ్రేకప్, పెళ్ళికి ముందు అవసరమైన ఇన్వెస్టిగేషన్, కావాలంటే మూడు ముళ్ళు పడకముందే వాటిని ఆపేయడం ఇలా అన్ని సర్వీసులు ఇస్తాడు. ఒక క్లయింట్ గా వచ్చిన అమ్మాయి(రాశి సింగ్)ని లైఫ్ పార్ట్ నర్ ని చేసుకోవాలని డిసైడవుతాడు. అక్కడ అసలు స్టోరీ మొదలవుతుంది.

యూత్ హీరోల్లో ప్రామిసింగ్ గా కనిపించే వాళ్లలో సంతోష్ శోభన్ పేరుని చేర్చుకోవచ్చు. కాకపోతే లక్కు అతనితో దోబూచులాడుతూ సక్సెస్ అందివ్వడం లేదు. ఫ్యామిలీ కథలు, మంచి డైరెక్టర్లు, పెద్ద బ్యానర్లను ఎంచుకుంటున్నా హిట్టు మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. అన్నీ మంచి శకునములే మీద గంపెడాశలు పెట్టుకుంటే అది కూడా నిరాశ పరిచింది. ఆగస్ట్ లో ప్రేమ్ కుమార్ గా రాబోతున్నాడు. అభిషేక్ మహర్షి దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ కోసం వెరైటీ ప్రమోషన్లైతే చేస్తున్నారు. ఇవాళ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

తెలంగాణ ఓటర్లు 3,17,32,727 –

– కొత్త ఓట్లు 17.01 లక్షలు తుది జాబితా విడుదలనవ...

15 శాతం ఐఆర్‌ ప్రకటించాలి –

– సీఎస్‌ ఓఎస్డీ విద్యాసాగర్‌కు యూఎస్‌పీసీ వినతినవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌రాష్ట్రంలోని ఉద్యోగులు,...

భూసేకరణ నోటిఫికేషన్‌కు –

– ముందు విధిగా గ్రామసభ : హైకోర్టునవతెలంగాణ బ్యూరో –...

ఐక్య పోరాటానికి తలొంచిన సర్కార్‌ –

– అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి హామీ– 24 రోజుల సమ్మె...