దేశంలో పెరుగుతున్న హిందూఫోబియా కార్యకలాపాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని, హిందూ సమాజ హక్కులను పరిరక్షించాలని భారతీయ అమెరికన్ల బృందం యూఎస్ చట్టసభ సభ్యులను కోరింది.యూఎస్ క్యాపిటల్‌లో ఉత్తర అమెరికా హిందువుల కూటమి (CoHNA) ఆధ్వర్యంలో జరిగిన రెండవ జాతీయ హిందూ న్యాయవాద దినోత్సవానికి 21 మంది కాంగ్రెస్ సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు అమెరికాలో హిందువుల పట్ల పెరుగతున్న వివక్షపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు.ఈ సందర్భంగా యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్ కార్మిక్( Rich McCormick ) మాట్లాడుతూ.
కేవలం జాతి ద్వారా మాత్రమే కాకుండా మతం, హిందూఫోబియా ద్వారా ఇక్కడ వివక్ష వుందన్నారు.కాలిఫోర్నియా( California ) తీసుకొచ్చిన ఎస్‌బీ403 వంటి బిల్లులు జాత్యహంకార, వివక్ష, విభజనకు దారి తీస్తాయని మెక్ కార్మిక్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ తరహా బిల్లులు ప్రజలను వర్గీకరించడానికి ప్రయత్నిస్తాయన్నారు.

భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు శ్రీతానేదార్ మాట్లాడుతూ( Shri Thanedar ).తాను ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛ వుండాలని బలంగా విశ్వసిస్తానని అన్నారు.అలాంటి దాడులకు , ఫోబియాకు వ్యతిరేకంగా నిలబడతానని శ్రీతానేదార్ పేర్కొన్నారు.
విభిన్న సమూహాలకు ప్రాతినిథ్యం వహించడం, మత స్వేచ్ఛ ప్రాముఖ్యతపై ఆయన మాట్లాడారు.హిందూ మతం శాంతినే కోరుకుంటుందని.
అయినప్పటికీ దానిపైనా దాడులు జరుగుతున్నాయని శ్రీతానేదార్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇతరుల మాదిరిగానే హిందువులు కూడా తమ మతాన్ని ఎలాంటి ద్వేషం, పక్షపాతం, ఫోబియా లేకుండా ఆచరించడానికి అర్హులన్నారు.
ఒక కాంగ్రెస్ సభ్యుడిగా పార్లమెంట్‌లో హిందూ కాకస్ లేకపోవడాన్ని గుర్తించానని .ఈ క్రమంలో దానిని రూపొందించడంలో సహాయపడతానని శ్రీతానేదార్ హామీ ఇచ్చారు.

ఈ సమావేశానికి హాంక్ జాన్సన్, టామ్ కీనే, రిచ్ మెక్‌కార్మిక్, థానేదార్, బడ్డీ కార్టర్ , శాన్‌ఫోర్డ్ బిషప్, ఒహియో స్టేట్ సెనేటర్ నీరాజ్ అంటానీ సహా 12 రాష్ట్రాల నుండి హిందూ అమెరికన్లు హాజరయ్యారు.అమెరికాలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని అటానీ వ్యాఖ్యానించారు.CoHNA ప్రెసిడెంట్ నికుంజ్ త్రివేది ప్రకారం.అమెరికాలో హిందువుల గురించి అవగాహన పెరుగుతోందన్నారు.
