‘పుష్ప 2’ డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్..

Date:

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలై భారీ విజయం సాధించింది. ప్రేక్షకులు మాత్రమే కాదు స్టార్ సెలబ్రిటీలు కూడా బేబీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ స్వయంగా సినిమా చూసి బేబీ సినిమాని అభినందించడానికి ప్రత్యేకంగా ఈవెంట్ కూడా పెట్టాడు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ రావడం పట్ల సినిమా టీమ్ కృతజ్ఞతను, సంతోషాన్ని తెలియజేసింది. ఇకపోతే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ స్పీచ్ అదిరిపోయింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. బేబీ సినిమా టోటల్ టీమ్ కు నా కంగ్రాంట్స్ చెబుతున్నా. సినిమాను చించేశారు. 7జీ బృందావన్ కాలనీ, అర్జున్ రెడ్డి లాంటి కొన్ని సినిమాలే ప్రేమలోని బాధను తెలియజేస్తాయి. అలాంటి సినిమాలు తీయడం కష్టం. ఎందుకంటే అలాంటి లవ్ పెయిన్ చూపించే కథలు సులువుగా రావు. మన జీవితంలో చూస్తేనే, అనుభూతి చెందితేనే వస్తాయి. లైఫ్ నుంచి స్పూర్తి పొందితేనే బేబీ లాంటి సినిమా తీయగలం. ఒకరోజు బేబీ ఫస్ట్ హాఫ్, మరో రోజు సెకండాఫ్ చూశా. సినిమా పూర్తయ్యాక సిక్సర్ కొట్టారు అనిపించింది. ఈ సినిమా గురించి గంట సేపు చెప్పగలను. ఇందులో చాలా అంశాలు నచ్చాయి. సినిమా రాసిన విధానం, తెరకెక్కించిన విధానం, ఆర్టిస్టుల పర్మార్మెన్సులు ఇలా ప్రతీది ఆకట్టుకుంది. వీళ్ల పర్మార్మెన్స్ చూసి షాక్ అయ్యాను. వారి నటనలో ఎంతో జెన్యూనిటీ ఉంది. చిన్నసినిమాలు థియేటర్ లో ప్రేక్షకులు చూడటం లేదు అనేది అబద్ధం. సినిమా బాగుంటే మీడియా, ప్రేక్షకులు నిజాయతీగా మద్దతు, ప్రేమ ఇస్తారు, అందుకు బేబీ సక్సెస్ నిదర్శనం.

ఒక తల్లి బేబీని కనడానికి ఎంత కష్టపడుతుందో ఈ బేబీ సినిమా మేకింగ్ కోసం డైరెక్టర్ సాయిరాజేశ్ అంత కష్టపడ్డాడు. సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరు ఎలా ఎదుగుతారో తెలియదు, అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సాయిరాజేశ్. కలర్ ఫొటో సినిమా చూసినప్పుడే అతను మంచి దర్శకుడు అనిపించింది. సాయిరాజేశ్ స్క్రిప్ట్ రాసిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆనంద్, వైష్ణవి, విరాజ్..ఇలా అందరూ పాత్రల్లో జీవించారు. నాకు పర్సనల్ గా ఇలాంటి కథలు ఇష్టం. అందుకే బేబీ నచ్చిందేమో. ఈ సినిమా మీద ఆనంద్ పెట్టుకున్న నమ్మకమే ఈ సక్సెస్. విరాజ్ చాలా క్యూట్ గా ఉన్నాడు. చాలా బాగా డీసెంట్ గా నటించాడు. అవార్డుల ఫంక్షన్స్ లో మన హీరోయిన్స్ కనిపించక బాధనిపిస్తుంది. తెలుగు అమ్మాయిలు వచ్చి సినిమాలు చేయాలి. ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు భయపడక్కర్లేదు. మీ పేరెంట్స్ ని ఒప్పించి సినిమా ఇండస్ట్రీకి రండి. ఎవరి భాషలో వాళ్లే బాగుంటారు. ఇవాళ మన తెలుగమ్మాయి వైష్ణవి హిట్ కొట్టడం సంతోషంగా ఉంది అని చెప్పారు.

ఇక చివరిగా స్పీచ్ అయిపోయిన అనంతరం ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్ అంతా పుష్ప 2 సినిమా గురించి అడిగారు. దీంతో బన్నీ మాట్లాడుతూ.. పుష్ప 2 డైలాగ్ కావాలా? ఇప్పుడు లీక్ చేయాలా.. చిరు లీక్స్ కంటే ఇది పెద్దది అయిపోద్దేమో. నేను చెప్తా అనుకోలేదు కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సినిమా పేరు పుష్ప 2 ది రూల్. సినిమాలో ఒక్కటే ఉంటుంది. ‘ఈడ నడుస్తుందంతా ఒక్కటే రూల్. పుష్ప గాడి రూల్’ అని చెప్పారు. దీంతో ఈ డైలాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

షాక్‌లో తార‌క్ ఫ్యాన్స్

ముందు విష‌యాన్ని జీర్ణించుకుని ఆ త‌ర్వాత త‌మ ఎగ్జైట్మెంట్‌ను పంచుకుందాం...

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...