పవర్ స్టార్ ను ఇమిటేట్ చేసిన చిరు..!

Date:

ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న మూవీ భోళా శంకర్‌. మెహర్‌ రమేశ్‌ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగష్టు 11న రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్స్, గ్లింప్స్‌, సాంగ్స్‌ ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. అయితే చిరు లీక్స్ పేరుతో ఎప్పటికప్పుడు తన సినిమాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పేస్తుంటారు చిరంజీవి. తాజాగా మరో లీక్ వదిలారు.

ఈ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. నేను భోళా శంకర్ సినిమాలో పవన్ కల్యాణ్‌ ను ఇమిటేట్ చేస్తున్నాను. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో నన్ను, నా డైలాగ్స్ మరియు నా పాటలకు డ్యాన్స్ చేసేవాడు. ఇప్పుడు నేను అందరినీ అలరించడానికి భోళా శంకర్‌లో పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్‌లను అనుకరిస్తాను. ఆడియెన్స్ వీటిని చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన ఖుషి నుండి యే మేరా జహా పాటను ఇమిటేట్ చేస్తూ ఒక చిన్న క్లిప్‌ను విడుదల చేశాడు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే, సినిమాలో ఇంకా ఉంది అని మెగాస్టార్ తెలిపారు. దీంతో ఇటు మెగాస్టార్ అటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా వున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్‌ మెగాస్టార్‌ చెల్లెలిగా కనిపించనుంది. అలాగే సుశాంత్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...