పవన్ ‘బ్రో’ పాత్ర నిడివి ఎంతంటే

Date:


అయినా సరే పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆద్యంతం ఫీలయ్యేలా రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలివిగా స్క్రీన్ ప్లే రాసినట్టు వినికిడి. దర్శకుడు సముతిరఖని ఒరిజినల్ తో పోలిస్తే ఈ మార్పులు ఎక్కువే అయినప్పటికీ బిజినెస్ దృష్ట్యా కీలకం కావడంతో వాటిని అంతే పర్ఫెక్ట్ గా తెరకెక్కించారని అంటున్నారు. తమన్ మ్యూజిక్ పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ పరంగానే ఎక్కువ మెప్పిస్తుందని అంటున్నారు. పవన్ కు ప్రత్యేకంగా హీరోయిన్ తో పాటలు లేకపోయినా ఫైట్లు, ఊర్వశి రౌతేలా పబ్బు సాంగ్, మంచి టైమింగ్ ఉన్న డైలాగులు అభిమానులకు సంతృప్తి  కలిగించేలా ఉంటాయట. చూద్దాం మరి. 

ఇక బ్రోలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నిడివి ఎంత ఉంటుందనే దాని మీద రకరకాల ప్రచారాలు ఉన్నాయి కానీ నమ్మదగిన వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఇలా ఉంది. పవర్ స్టార్ ఎంట్రీ సినిమా మొదలైన ఇరవై నిమిషాల తర్వాత ఉంటుంది. అప్పటిదాకా ప్రైవేట్ కంపెనీలో మధ్య తరగతి ఉద్యోగిగా సాయి ధరమ్ తేజ్ కష్టాలను ఫన్నీగా చూపిస్తారు. సమయం మనిషి రూపంలో రావడం మొదలయ్యాక  అక్కడి నుంచి పవన్ పాత్ర మొత్తం లెన్త్ లో తొంబై నిమిషాల దాకా  వస్తుందట. అంటే ఇంకో ముప్పావు గంట తేజు, ఇతర తారాగణం మధ్య సన్నివేశాలు, పాటలతో గడిచిపోతుంది.

సరిగ్గా ఇంకో రెండు వారాల్లో విడుదల కాబోతున్న బ్రో మీద బజ్ సంగేతేమో కానీ అభిమానులు మాత్రం జనసేన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ స్పీచులను, ప్రభుత్వాన్ని ఎండగడుతున్న తీరుని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వీటి తాలూకు ప్రభావం రాజకీయ పరిణామాల మీద గట్టిగానే ఉండబోతోందన్న విశ్లేషకుల అంచనాల మధ్య ఇప్పుడు ఫ్యాన్స్ మూడ్ అంతగా బ్రో మీద లేదన్నది వాస్తవం. దానికి తోడు ప్రమోషన్ కూడా నత్తనడకన సాగుతోంది. టీజర్, లిరికల్ సాంగ్, మేకింగ్ వీడియో వదలారు కానీ  అవేవీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంత రేంజ్ లో లేవన్నది నిజం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఏం లాభం

వ్యక్తిగత అజెండాలతో సినిమాలు తీస్తే ఫలితాలు అన్నివేళలా ఒకేలా రావని...