మెగా ఫ్యాన్స్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan, )ఫ్యాన్స్ జులై 28 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఎందుకో అందరికి తెలుసు.
ఎందుకంటే పవర్ స్టార్ కీలక రోల్ లో నటించిన ‘బ్రో ది అవతార్‘ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతుంది.పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఉన్నారు.

మరో రెండు వారాల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.దీంతో మేకర్స్ కూడా వరుస ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.ఇప్పటికే టీజర్, రెండు పాటలు కూడా రిలీజ్ చేయగా టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.పాటలు మాత్రం అంతగా అలరించలేక పోతున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
జులై 21న ట్రైలర్ రిలీజ్ కానుంది.
అందుకోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో పవన్ కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.
మరి ఈయన రోల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.ఎప్పటి వరకు ఈయన రోల్ ఉంటుంది అని ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ రోజురోజుకూ పెరుగుతుంది.
ఈ విషయంలో తాజాగా సాయి ధరమ్ తేజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ అయిన పావు గంటలోనే ఎంట్రీ ఇస్తాడని.
అక్కడ నుండి క్లైమాక్స్ వరకు పవన్ ఉంటారని చెప్పడంతో ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.చూడాలి ఈ మూవీ ఎలా అలరిస్తుందో

ఇక మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కించారు.ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ( Ketika Sharma ) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.కాగా ఈ సినిమా జులై 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
