రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.చంద్రబాబు ట్రైనింగులో పవన్ కళ్యాణ్ బలి పశువు కాబోతున్నారని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు ట్రాప్ లో పడిపోయి రోజు రోజుకి ఉన్మాదిలా మారిపోతున్నారని అన్నారు.చంద్రబాబు ఎవరిని ప్రశ్నించమంటే పవన్ వారిని ప్రశ్నిస్తున్నారు.
పవన్ ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలి.ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు.
చంద్రబాబుని విమర్శించే వారిని.ప్రశ్నిస్తానంటూ పవన్ టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు మహిళలు అంటే ద్వేషం.మహిళా సీఐ అనే గౌరవం లేకుండా జనసేన పార్టీ నేతలు వ్యక్తిగతంగా దూషించటం వల్లే ఆమె అలా వ్యవహరించారు.పవన్ కళ్యాణ్ కి చిత్తశుద్ధి ఉంటే సదరు మహిళా సీఐకి క్షమాపణలు చెప్పాలి.ఇదే సమయంలో విమర్శించిన జనసేన నాయకుడిని హెచ్చరించాలి అని గడికోట శ్రీకాంత్ రెడ్డి… పవన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
తనకు పోటీ లేకుండా ఉండేందుకు చంద్రబాబు.పవన్ కళ్యాణ్ ని.వాడుకుంటున్నారని ఆరోపించారు.చెడిపోయిన రాజకీయ వ్యవస్థను సీఎం జగన్ బాగుచేస్తున్నారు.
హుందాతనంగా.అందరికీ ఆదర్శంగా వ్యవహరిస్తున్నారు.చంద్రబాబు ఎప్పుడు కూడా అలా వ్యవహరించలేదు.వెన్నుపోటు… వ్యవస్థల మేనేజ్మెంట్ కే ప్రాధాన్యత ఇచ్చారు అని విమర్శించారు.