‘బ్రో’ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా వచ్చారు?
మా అమ్మ సూచనతో నేను అప్పటికే మాతృక వినోదయ సిత్తం చూశాను. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. బ్రో కోసం సముద్రఖని గారు ఫోన్ చేసి లుక్ టెస్ట్ కోసం రమ్మన్నారు. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లు పరిశీలించి, చివరికి నన్ను ఎంపిక చేశారు. నాలాంటి నూతన నటికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో భాగమయ్యే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి అగ్ర నటులతో ఒకట్రెండు సన్నివేశాల్లో నటించడమే నాలాంటి వారికి గర్వంగా ఉంటుంది.