న్యూయార్క్‌లో భారతీయ కళాఖండాల ప్రదర్శన .. ఆకట్టుకుంటున్న క్రీ.పూ 2వ శతాబ్ధం నాటి శిల్ప సంపద

Date:


ప్రాచీన భారతదేశంలోని ప్రారంభ బౌద్ధ కళలను( Early Buddhist Art ) హైలైట్ చేసేలా 140కి పైగా కళాఖండాలతో న్యూయార్క్‌లోని ప్రఖ్యాత మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్(మెట్)లో( Metropolitan Museum of Art ) ప్రదర్శను ఏర్పాటు చేశారు.ఇందులో క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుపూర్వం 400 నాటి కళాఖండాలను ప్రదర్శించనున్నారు.

 New York Metropolitan Museum Of Art Hosts Exhibition Highlighting Early Buddhist-TeluguStop.com

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ది రాబర్ట్ హెచ్ఎన్ హో ఫ్యామిలీ ఫౌండేషన్ గ్లోబల్ అండ్ ఫ్రెడ్ ఐచానర్ ఫండ్‌లు సంయుక్తంగా ‘Tree Serpent: Early Buddhist Art in India, 200 BCE–400 CE’ పేరుతో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి.జూలై 21 నుంచి నవంబర్ 13 వరకు మెట్‌లో ఈ ప్రదర్శన జరుగుతుంది.

ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఈ మ్యూజియంలో స్పెషల్ ప్రివ్యూ , రిసెప్షన్ జరిగింది.ఈ కార్యక్రమానికి అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ, న్యూయార్క్‌లోని భారత కాన్సులర్ జనరల్ రణ‌ధీర్ జైస్వాల్ , భారతీయ కమ్యూనిటీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

Telugu America, Art, Eric Garcetti, Evocative, Indiahistorical, York, Nita Amban

క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుపూర్వం 400 నాటి 140కి పైగా కళాఖండాలు, భారతదేశంలో బౌద్ధానికి పూర్వం వున్న అలంకారిక శిల్పం, ఇంటర్‌లాకింగ్ థీమ్‌ల శ్రేణిని ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు.ఈ సందర్భంగా భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి( Eric Garcetti ) ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.ఇలాంటివి భారత్ అమెరికా సంబంధాలను బలోపేతం చేస్తాయన్నారు.

Telugu America, Art, Eric Garcetti, Evocative, Indiahistorical, York, Nita Amban

అమెరికన్లు భారతదేశ చరిత్ర, ( Indian History ) ఆ దేశం మతపరమైన గతం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని గార్సెట్టి పేర్కొన్నారు.భారత్‌, యూకే, యూరప్, అమెరికాలకు చెందిన డజను మంది సహాయంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు మెట్ తెలిపింది.ఇండో- రోమన్ మార్పిడికి సంబంధించిన వస్తువులు వాణిజ్యంలో ప్రాచీన భారతదేశ స్థానాన్ని వెల్లడిస్తాయని పేర్కొంది.

అంతకుముందు గతంలో భారతదేశం నుంచి దొంగిలించబడిన 105 పురాతన కళాఖండాలను అమెరికా( America ) ఇండియాకు అప్పగించింది.న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సమక్షంలో అప్పగింతల ప్రక్రియ పూర్తయ్యింది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...

సౌందర్య శోభనను మర్చిపోతే ఎలా

దీంట్లో దివంగత సౌందర్య ఒరిజినల్ లో నటించిన శోభనకు ఎంత...