భారతదేశం తాజాగా తన పొరుగు దేశమైన నేపాల్( Nepal )కు 34 అంబులెన్స్‌లు, 50 స్కూల్ బస్సులను బహుమతిగా ఇచ్చింది.నేపాల్ అభివృద్ధికి సహాయపడే నేపాల్-ఇండియా డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రభుత్వం వీటిని గిఫ్ట్ గా ఇచ్చింది.
నేపాల్‌లోని సైన్స్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ మంత్రి ఈ వాహనాలను ఉపయోగించే సంస్థలకు తాళాలను అందజేశారు.విద్యార్ధులకు సహాయం చేయడంలో భారత ప్రభుత్వం చేసిన ఈ సహాయానికి నేపాల్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

భారతదేశానికి చెందిన అధికారులు అంబులెన్స్‌లను నేపాల్ హెల్త్ సర్వీస్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎస్‌సీ)( Nepal health care system )కి, స్కూల్ బస్సులను ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అప్పగించారు.నేపాల్‌లోని పాఠశాలలు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేవని, అందువల్ల కొన్నిసార్లు విద్యార్థులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని వారు చెప్పారు.ఎక్కువ బస్సులు ఉండటం వల్ల పాఠశాలకు వెళ్లేందుకు సులువుగా ఉంటుందని అన్నారు.

నేపాల్‌లోని భారత రాయబారి కూడా భవిష్యత్తులో మరిన్ని స్కూల్ బస్సులను ఇస్తామని హామీ ఇచ్చారు.ఆరోగ్యం, విద్యలో నేపాల్‌కు భారతదేశం( India ) మద్దతు కొనసాగిస్తుందని రాయబారి చెప్పారు.నేపాల్ ప్రజలకు సహాయం చేయాలని, వారి అభివృద్ధికి కలిసి పని పనిచేయాలనుకుంటున్నామని స్పష్టం చేశారు.1994 నుంచి నేపాల్-ఇండియా డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ ప్రోగ్రామ్ కింద మొత్తం 974 అంబులెన్స్‌లు, 234 స్కూల్ బస్సులను భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఉచితంగా అందించింది.నేపాల్‌లో కొనసాగిస్తున్న ప్రాజెక్టులకు గానూ భారత ప్రభుత్వానికి విద్యా మంత్రి రాయ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సాయం రెండు దేశాల ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తుందని, సంబంధాలను మెరుగుపరుస్తుందని ఆయన ఆశించారు.
