నేను అల్లు అర్జున్ కు వీరాభిమానిని : ధోని భార్య సాక్షి

Date:





ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తారింటిలోకి అడుగు పెట్టాల్సిన అమ్మాయి అత్త‌గారితో క‌లిసి ఉండ‌లేన‌ని, వేరు కాపురం పెడ‌తామ‌ని పెళ్లికి ముందే ఆ కాబోయే వ‌రుడితో అంటే.. త‌న‌కు కాబోయే అత్త ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఆమెతో ఓ వారం ట్రిప్ వెళతాన‌ని అమ్మాయి చేసుకోబోయే అబ్బాయితో అంటే.. ఓ వైపు త‌ల్లి.. మ‌రో వైపు కాబోయే భార్య మ‌ధ్య ఆ కుర్రాడు ఎలా ఇబ్బంది ప‌డ్డాడ‌నే క‌థాంశంతో రూపొందిన ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married). ఇండియ‌న్ లెజెండ్రీ క్రికెట‌ర్ ఎం.ఎస్‌.ధోని ‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married)తో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో హ‌రీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియా, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాను ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్‌ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని, వికాస్ హ‌స్జా నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 4న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్‌.ఫిల్మ్స్‌, త్రిపుర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ విడుద‌ల చేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో.. నిర్మాత సాక్షి ధోని, హీరో హరీస్ క‌ళ్యాణ్‌, హీరోయిన్ ఇవానా, న‌దియా, త్రిపుర ప్రొడ‌క్ష‌న్స్ త్రిపుర ప‌సుపులేటి త‌దిత‌రులు పాల్గొన్నారు. నిట్రో స్టార్ సుధీర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా

సాక్షి ధోని మాట్లాడుతూ.. “సాధార‌ణంగా మావారు ధోని.. ఎప్పుడూ స‌ర్‌ప్రైజ్‌లిస్తుంటారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన మ‌రో స‌ర్ప్రైజ్ ఇది. సాధార‌ణంగా క్రికెట్ అంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్. కానీ మా వారికి అది ప్రొఫెష‌న్‌. క్రికెట్ ఎలాగో సినిమా కూడా ఎంట‌ర్‌టైన్మెంట్ కాబ‌ట్టి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాం. ఇద్ద‌రం చాలా సినిమాలు చూస్తాం. అది థియేట‌ర్‌లో కావ‌చ్చు. ఓటీటీలో కావ‌చ్చు. ఆ ఇష్టంతోనే ఈ రంగంలోకి వ‌చ్చాం. ఇంకా మ‌రెన్నో సినిమాల‌ను చేయ‌టానికి సిద్ధంగా ఉన్నాం. ‘ఎల్‌జీఎం’ సినిమాను త‌మిళంలో చేసినా, తెలుగులో ధోనికి భారీ సంఖ్య‌లో అభిమానులున్నారు. అందువ‌ల్ల తెలుగులో డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. తెలుగు సినిమాల‌ను హిందీలోకి అనువాదం చేసి యూ ట్యూబ్‌లో రిలీజ్ చేసేవాళ్లు నేను వాటిని చూసేదాన్ని.

ముఖ్యంగా నేను అల్లు అర్జున్ సినిమాల‌న్నింటినీ చూశాను. నేను త‌న‌కు పెద్ద అభిమానిని. నేను స్టోరీ డిస్క‌ష‌న్‌లో డైరెక్ట‌ర్‌తో మాట్లాడేదాన్ని. ఎక్కువ‌గా ఫీడ్ బ్యాక్ తీసుకుని మంచి ఔట్‌పుట్ కోసం డిస్క‌స్ చేసుకునేవాళ్లం. అలా క్రియేటివ్ సైడ్ నా వంతు పార్ట్‌ను నేను తీసుకున్నాను. ఇదొక ఇండిపెండెంట్‌గా ఉండే అమ్మాయి క‌థ‌. సాధార‌ణంగా మ‌న రిలేష‌న్స్‌లో పొర‌ప‌చ్చాలు వ‌స్తుంటాయి. వాటిని తిరిగి నిల‌బెట్టుకుటూ వెళుతుంటాం. మ‌న లైఫ్‌లో రిలేష‌న్ షిప్స్ గురించి చెప్పే సినిమా ఇది. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ప్పుడు త‌న మ‌న‌సులో ఎలా ఫీల్ అవుతుంటుంది. దానికి ఆమె ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంద‌నే పాయింట్‌తో ‘ఎల్‌జీఎం’ సినిమాను తెర‌కెక్కించాం. ఆగ‌స్ట్ 4ప మూవీ రిలీజ్ అవుతుంది“ అన్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే..

గంటలు గంటలు డెస్క్ ముందు పనిచేస్తుంటారా? అయితే ఇది మీ...

సిద్ధు ఆవేదనలో న్యాయముందా?

ఇక కొన్ని నెలల కిందట ‘టక్కర్’ అనే అనువాద చిత్రంతో...

బ్రహ్మోత్సవం వెనక్కు పెదకాపు ముందుకు

పెదకాపు 2 జరగడం అనుమానమే. ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ చూశాక...

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్ హీరో 

పాకిస్థాన్ నటితో రెడ్ హ్యాండ్ గా దొరికిన బాలీవుడ్ స్టార్...