నీటమునిగిన లేడీస్ హాస్ట‌ల్.. చిక్కుకున్న 270 మంది విద్యార్థినిలు

Date:

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వరంగల్ నగరాన్ని ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా వరదలతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా వ‌రంగ‌ల్ హాంట‌ర్‌రోడ్డులో వ‌ర‌ద బీభత్సం సృస్టిస్తోంది. అక్క‌డే ఉన్న ఇంట‌ర్ గ‌ర్ల్స్ హాస్ట‌ల్ చూట్టూ నీరు భారీగా చేరుకుంది. దీంతో బ‌య‌ట‌కి రావ‌డానికి వీలు లేక‌పోవ‌డంతో భ‌వ‌నం ఎక్కిన విద్యార్థినులు, సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

హాస్ట‌ల్ బిల్డింగ్‌లో పూర్తిగా 270 మంది విద్యార్థినిలు ఉన్నారు. వ‌ర‌ద ఉధృతి వేగంగా ఉండ‌టంతో విద్యార్థినుల‌ను బ‌య‌ట‌కు తీసుకు రాలేక పోతున్నారు. దీంతో వారికి కావాల్సిన ఆహారాన్ని హాస్ట‌ల్ సిబ్బంది ప‌డ‌వ‌ల స‌హాయంతో తీసుకెళ్లి అందిస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న విద్యార్థినుల త‌ల్లిదండ్రుల‌కు ఆందోళ వ్య‌క్తం చేస్తున్నారు. విద్యార్థినుల‌ను ప‌డ‌వ‌ల ద్వారా బ‌య‌టికి తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం, రెస్క్యూ టీం ప్ర‌య‌త్నిస్తోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...