అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కెరియర్ ను మొదలుపెట్టిన నాని, ప్రస్తుతం న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు.ఓ బ్యాక్ గ్రౌండ్ లేని వ్యక్తి హీరోగా ప్రేక్షకులను మెప్పించి సెల్ఫ్ మేడ్ స్టార్ అవ్వడం చాలా కష్టం అలాంటి ఘనతను సాధించిన కొందరిలో నాని ఒకడు.నాని యాక్టింగ్,మాట తీరుకి చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు.ప్రత్యేకంగా ఈయనకు యువతలో చాలా ఫాలోయింగ్ ఉంది.అందుకే నాని చిత్రాలన్నీ టాప్ హీరోల రికార్డ్స్ ను కొల్లగొడుతున్నాయి.

ఫిబ్రవరి 24 1984 లో జన్మించిన నాని ఈ ఏడాది శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న టక్ జగదీష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఈ చిత్రంలో నాని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రితు వర్మ,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తుండగా, సన్ షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫ్యామిలీ ఎమోషన్స్ కు అద్దం పట్టేలా ఉన్న ఈ చిత్రం హిట్ అయ్యి నానికి మంచి మేమోరిస్ ను ఇవ్వాలని కోరుకుంటూ విషింగ్ మేని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే న్యాచురల్ స్టార్.

