ప్రభాస్ మహానటి ఫేం నాగ్ అశ్విన్ తో సినిమా అనౌన్స్ చేసిన విషయం మనకి తెలిసిందే.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ మధ్య నాగ్ అశ్విన్ నెట్ ఫ్లిక్స్ లో పిట్ట కథలు అనే సీరీస్ చేశారు.ఈ సీరీస్ లో మాదిరిగానే ప్రభాస్ తో చేయనున్న సినిమాలో కూడా ఆయన ఒక కొత్త వర్చువల్ ప్రపంచాన్ని తయారు చేస్తున్నారట.అందుకోసం కొత్తరకం బట్టలు, కార్ లు మిగతా వస్తువులు తయారు చేయించే పనిలో ఆయన మరియు ఆయన టీమ్ అంతా బిజీగా ఉన్నట్టు సమాచారం.
వైజయంతి మూవీస్ పతాకంపై రానున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే,బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు.ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ స్వరాలు అందిస్తున్నారు.