నకిలీ వజ్రాలతో ఘరానా మోస ప్రయత్నం.. అడ్డంగా బుక్కైన నిందితులు..!

Date:


ఇటీవల కాలంలో కష్టపడి సంపాదించేవారు 25 మంది ఉంటే అడ్డదారుల్లో సంపాదించేవారు 75 మంది ఉన్నారు.మనిషిని మోసం చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల్లో ఘరానా మోసాల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.

 Gharana Fraud Attempt With Fake Diamonds , Fake Diamonds, Fraud, Chandrakumar A-TeluguStop.com

కేవలం అమాయకులు కనిపిస్తే చాలు మాయమాటలతో బురిడీ కొట్టి లక్షల్లో మోసం చేసిన్నట్టేట ముంచేస్తున్నారు.ఇలాంటి కోవలోనే నకిలీ వజ్రాలతో( fake diamonds ) భారీ ఘరానా మోసం చేసే ప్రయత్నం విఫలం అయిన సంఘటన చిత్తూరు జిల్లాలోని పలమనేరులో చోటుచేసుకుంది.

అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

Telugu Diamonds, Fraud, Kannayya Goud, Latest Telugu-Latest News - Telugu

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.పలమనేరు మండలంలోని ఎం.కోటూరు గ్రామానికి చెందిన కన్నయ్య గౌడ్ అనే వ్యక్తిని 12 నకిలీ వజ్రాలతో మోసం చేసేందుకు చంద్రకుమార్ ఆలియాస్ డేవిడ్( Chandrakumar alias David ), శ్రీనివాసులు అనే వ్యక్తులు ప్రయత్నించారు.చివరికి అడ్డంగా బుక్కై పోలీసుల చేతికి చిక్కారు.అసలు ఏం జరిగిందంటే.? 12 నకిలీ వజ్రాలను కన్నయ్య గౌడ్ కు చూపించి, ఇవి రూ.20 లక్షల రూపాయల ఖరీదైనవని, డబ్బు అవసరం ఉండడంతో కేవలం రూ.10 లక్షల రూపాయలకే విక్రయిస్తున్నామని చంద్రకుమార్, శ్రీనివాసులు నమ్మకపు మాటలు పలికారు.ఒకవేళ కావాలంటే వీటి నాణ్యతను పరీక్షించుకొని వచ్చి డబ్బులు ఇవ్వాలని ఆ నకిలీ వజ్రాలను కన్నయ్య గౌడ్( Kannayya Goud ) చేతికి ఇచ్చారు.

కన్నయ్య గౌడ్ ఆ వజ్రాలను పరీక్షించుకొని వచ్చేందుకు వెళ్లాడు.దారి మధ్యలో మరో వ్యక్తి కన్నయ్య గౌడ్ కోసం కాపు కాసి ఆ వజ్రాలను కొట్టేశాడు.

Telugu Diamonds, Fraud, Kannayya Goud, Latest Telugu-Latest News - Telugu

ఈ విషయాన్ని చంద్రకుమార్, శ్రీనివాసులకు తెలుపగా తమకు రూ.10 లక్షల రూపాయలు లేదా వజ్రాలు తిరిగి ఇవ్వాలని కన్నయ్య గౌడ్ ను ఒత్తిడికి గురి చేశారు.నిందితుల బెదిరింపులను భరించలేకపోయిన కన్నయ్య గౌడ్ చివరికి పోలీసులను ఆశ్రయించాడు.కూపి లాగితే డొంక కదిలినట్లు రంగంలోకి దిగిన పోలీసులకు కన్నయ్యను ట్రాప్ చేసేందుకే నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం ఇలా ప్రయత్నించారని బయటపడింది.

నిందితులైన శ్రీనివాసులు, చంద్రకుమార్ లను అదుపులోకి తీసుకొని, ఆ 12 నకిలీ వజ్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలుLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...