హరీష్ కల్యాణ్ హీరోగా రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎల్‌జీఎం. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. లెజెండరీ క్రికెటర్ ఎంఎస్‌ధోని, ఆయన భార్య సాక్షి ఈ సినిమాను నిర్మించారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. సినిమా ఇండస్ట్రీలో ధోనికి ఫస్ట్ వెంచర్ ఇది. ఇప్పటిదాకా, ధోనీ, అతని భార్య నిర్మాతలుగానే ప్రమోట్ అయింది ఎల్‌జీఎం. కానీ ఇప్పుడు అంతకు మించిన న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో ధోనీ నటిస్తున్నారనే వార్త ఆయన ఫ్యాన్స్ కి ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఎల్‌జీఎంలో ధోనీ ఓ ఇంపార్టెంట్ సీక్వెన్స్ లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారనేది టాక్. ఇంతకు ముందు పలు యాడ్స్ లో నటించారు ధోనీ. కెమెరాను ఫేస్ చేయడం ఆయనకేం కొత్తకాదు. షూటింగ్ ఎట్మాస్పియర్ ఎప్పటినుంచో అలవాటు ఉంది. అందుకే, డైరక్టర్ అడగ్గానే వెంటనే ఓకే చెప్పేశారట. దీనికి సంబంధించి, టీమ్ నుంచి ఇంకా అఫిషియల్ స్టేట్‌మెంట్ రాలేదు. హరీష్ కల్యాణ్, ఇవానా, నదియ, యోగిబాబు, ఆర్‌జె విజయ్, శ్రీనాథ్, వీటీవీ గణేష్, వినోదిని, దీపా శంకర్, విక్కల్స్ విక్రమ్, విక్కల్స్ హరి తదితరులు నటించారు.