ధనుష్ #D51 అనౌన్స్ మెంట్ వచ్చేసింది..

Date:





ధనుష్ 51వ చిత్రం లెజండరీ నిర్మాత, డిస్ట్రిబ్యుటర్, ఎగ్జిబిటర్ శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ జయంతి సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రం కోసం నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, టాలీవుడ్ మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్-విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ములతో చేతులు కలపనున్నారు. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లోని క్రేజీ చిత్రం #D51ని నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీర్వాదంతో నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ వారి నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియాన్ గ్రూప్)లో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి భారీ స్థాయిలో రూపొందించనున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ధనుష్ పుట్టినరోజు (జులై 28) సందర్భంగా మేకర్స్ #D51 కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంతకు ముందెన్నడూ చూడని అవతార్‌లో ధనుష్‌ని చూపించే పర్ఫెక్ట్ కథను శేఖర్ కమ్ముల సిద్ధం చేశారు. ఇకపోతే ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో రానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

టీఎస్పీఎస్సీ బోర్డును వెంటనే రద్దు చేయాలి

– కొత్త బోర్డు నియామకం చేసి గ్రూప్‌ 1 పరీక్షలు...

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా –

– నల్ల బెలూన్లతో ఆందోళననవతెలంగాణ-హైదరాబాద్‌తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు...

చంద్రబాబు అరెస్ట్‌పై కేసీఆర్‌ స్పందించాలి –

– మాజీ మంత్రి మోత్కుపల్లి విజ్ఞప్తి– రాజకీయాలకు అతీతంగా స్పందించాలని...

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...