HomeNewsAndhrapradeshదేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా మన రాష్ట్రం లో వైద్యానికి ...

దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా మన రాష్ట్రం లో వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నిరు పేదలను ఆదుకుం టున్న ఘనత రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై. యస్. జగన్ మోహన్ రెడ్డి కే

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా  మన రాష్ట్రం లో వైద్యానికి  ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నిరు పేదలను ఆదుకుం టున్న ఘనత రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై. యస్. జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రివర్యులు తానేటి వనిత అన్నారు. మంత్రి కార్యాలయం లో శుక్రవారం  నియోజకవర్గాల్లో వివిధ గ్రామాలలో అత్యవసర సమయాల్లో ప్రవేటు వైద్యం  చేయించు కున్న  35 మంది నిరు పేదలకు 23 లక్షల  రూపాయలు ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులను  లబ్దిదారులకు శుక్రవారం  మంత్రి వర్యులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత గారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి ఉదారంగా ముఖ్య మంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంది నిరుపేదలకు సాయం అందించి ఆదుకుంటున్నారని ప్రమాద , అత్యవసర సమయాల్లో ప్రవేటు వైద్యం చేయించు కున్నను ఆ వైద్యాన్ని కి అయిన సొమ్మును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆ నిరు పేదలుకు సొమ్ములు అందజేసి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని మంత్రి అన్నారు. కులం ,మతం,వర్గం,పార్టీ బేధం లేకుండా ముఖ్యమంత్రి వర్యులు త్వరితగతిన మంజూరు చేయుట పేద ప్రజల పట్ల మంత్రి అన్నారు.
ప్రతి కుటుంబానికి డాక్టర్ వై.యస్. ఆర్ ఆరోగ్య శ్రీ కార్డ్ అందించి 1200 రకాలు జబ్బులు కు ఉచితంగా వైద్య సేవలు అందించే కార్యక్రమం పైలెట్ ప్రాజెక్టు గా మన పశ్చిమగోదా వరి జిల్లా డిసెంబర్ 1 నుండి ప్రారంభం
చెయ్యనున్నామని మంత్రి అన్నారు.
వైద్యం కోసం ఎవ్వరూ ఇబ్బందులు పడకూడదు అని, అనాడు డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి ,
ఈరోజు తనయుడు శ్రీ జగన్ మోహన్ రెడ్డి విద్య ,వైద్యం కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి అన్నారు. కిడ్నీ ,క్యాన్సర్ వ్యాధిన పడితే ఆ కుటుంబం పరిస్థితి ఏలా ఉంటుందో చెప్పనవసరం లేదని ,
కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రతి నెలా రూ 10 వేలు అందించుట మంచి నిర్ణయం అని మంత్రి అన్నారు.
వైద్య కళాశాలలు , వైద్యాలయాలు సంఖ్యను పెంచి ఎక్కడ ప్రజలకు బాధలు పడకూడదు అనేది ప్రభుత్వ ఆలోచన అని మంత్రి అన్నారు .రాష్ట్రంలో 108 వాహనాలు జనవరి 1 నుండి 1000 వాహనాలు ,ప్రతి నియోజక వర్గంలో 5 వాహనాలు వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తానేటి వనిత గారు అన్నారు.
దివంగత మహానేత వై.యస్ ఆర్ 104 వాహనాలు ప్రవేశ పెట్టీ దేశానికీ ఆదర్శంగా నిలిచాయి అని గత ప్రభుత్యం 104 వాహనాలు నిర్వీర్యం చేశారని ,తనయుడు ముఖ్య మంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి 104 వాహనాలకు పూర్యవైభవం తీసుకు వచ్చి ,ప్రమాద ,అత్యవసర వైద్య సేవలు అందించి ప్రమాద మరణాలు శాతo లేకుండా చేస్తామని మంత్రి తెలిపారు.రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. మద్యం షాపులు ప్రభుత్వం మే నడపడం జరుగుతోందన్నారు. గ్రామాల్లో బెల్టుషాపులు రద్దు చేయడం వల్ల మహిళలు ఆనందంగా ఉన్నారన్నారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments