దేవిశ్రీ.. బాకీ తీర్చేయబోతున్నాడా?

Date:


ఆ చిత్రమే.. కంగువా. సూర్య హీరోగా శివ రూపొందిస్తున్న ‘కంగువా’ టీజర్ శనివారం అర్ధరాత్రి విడుదలైంది. అది చూసి తమిళ, తెలుగు ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోయారు. అందులో విజువల్స్ మామూలుగా లేవు. అదే సమయంలో బ్యాగ్రౌండ్ స్కోర్ మంటలు పుట్టించేసింది. టీజర్లో ఇంటెన్సిటీని ఇంకో లెవెల్‌కు తీసుకెళ్లింది ఆర్ఆర్. ఆరంభం నుంచి చివరి వరకు ఒక లెవెల్లో సాగింది బ్యాగ్రౌండ్ స్కోర్. ఈ సినిమాతో పాత బాకీలన్నీ తీర్చేస్తూ.. తన మీద ఉన్న విమర్శలన్నింటికీ దేవి బదులు చెప్పబోతున్నట్లే కనిపిస్తోంది. 

‘పుష్ప’ లాంటి ఒకటీ అరా చిత్రాల్లో మాత్రమే దేవిశ్రీ తన ముద్రను చూపించగలిగాడు. దేవి అభిమానులు అతడి పాత సినిమాల పాటలు, ఆర్ఆర్ బిట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నోస్టాల్జిగ్గా ఫీల్ అవుతూ అప్పటి దేవి ఏమైపోయాడు అని ఫీలయ్యే పరిస్థితి నెలకొంది. ఐతే చాన్నాళ్ల తర్వాత ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఓ సినిమా టీజర్‌తో బలమైన ముద్ర వేయగలిగాడు. అందరూ తన మ్యూజిక్ గురించి చర్చించుకునేలా చేయగలిగాడు.

ఈ టైంలో కూడా టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగానే ఉన్నాడు కానీ.. తన మ్యూజిక్‌లో మునుపటి ఫైర్ మాత్రం మిస్సయింది. చాలా సినిమాల్లో దేవి పాటలు అంచనాలను అందుకోలేకపోయాయి. నేపథ్య సంగీతం కూడా ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. అదే సమయంలో తమన్ రైజ్ అయ్యాడు. అరవింద సమేత, అల వైకుంఠపురములో, అఖండ లాంటి చిత్రాల్లో తన పాటలకు, నేపథ్య సంగీతానికి ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు తమిళంలో అనిరుధ్ లాంటి వాళ్ల దూకుడు మామూలుగా లేదు.

ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఒక వెలుగు వెలిగాడు. మణిశర్మ తర్వాత అతడికి దీటుగా నిలిచే సంగీత దర్శకుడే కనిపించలేదు. తమన్ నుంచి కొంత పోటీ ఉన్నా.. దేవిశ్రీ రేంజ్ వేరు అన్నట్లే ఉండేది. ఒక దశాబ్దానికి పాటు అతను తెలుగు సినిమా సంగీతాన్ని మామూలుగా ఏలలేదు. కానీ గత ఐదారేళ్లలో మాత్రం దేవి తనపై పెట్టుకున్న ఆశలు, అంచనాలను అందుకోలేకపోయాడనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...