ట్విట్టర్ ని( Twitter ) ఎలాన్ మాస్క్ సొంతం చేసుకున్నాక ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో అందరికీ తెలిసిందే.ఇక ఇదే మంచి తరుణం అనుకొని థ్రెడ్స్ యాప్ ని( Threads App ) మెటా జూలై 6వ తేదీన విజయవంతంగా లాంచ్ చేసింది.
లాంచ్ రావడంతోనే యాప్ 100 మిలియన్ల యూజర్ బేస్ ని సొంతం చేసుకుంది.దాంతో ప్రస్తుతం ట్విట్టర్ కి ఇది చాలామందికి ప్రత్యామ్నాయంగా మారింది అనడంలో సందేహమే లేదు.
ఈ యాప్ ఇటీవలే లాంచ్ అయిన మొదట్లో ట్విట్టర్లో ఉన్నన్ని ఫీచర్లు ఇందులో లేవు.కానీ రోజురోజుకీ ఈ యాప్ ట్విట్టర్ ని మించిపోయిలా ఫీచర్లను పరిచయం చేస్తూ మార్కెట్లో దూసుకుపోతోంది అనడంలో అతిశయోక్తి లేదు.
అవును, ఇన్నేళ్లుగా ట్విట్టర్ తన వినియోగదారులకు అందించలేకపోయిన కొన్ని ఫీచర్లను మెటా ఈ యాప్ లో అందించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే థ్రెడ్స్ యాప్ లో ట్విట్టర్లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు అనగా హ్యాష్ట్యాగ్లు, ట్రెండింగ్ శోధన, డైరెక్ట్ మెసేజ్ (డీఎం) వంటివి లేవు.
అయితే ఈ కంపెనీ త్వరలో వాటిని కూడా తీసుకువస్తుందని, దీని ద్వారా చాలా కొత్త ఫీచర్లను అందిస్తామని మెటా ఇప్పటికే ప్రకటించడం విశేషం.ఇక ట్విట్టర్లో లేనివి, థ్రెడ్స్ లో ప్రత్యేకంగా ఉన్న ఆరు ఫీచర్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1.ట్విట్టర్లో ప్రస్తుతం 4 ఫోటోలు, వీడియోలను మాత్రమే పోస్ట్ చేయగలరు.కానీ థ్రెడ్స్ లో మీరు ఇన్స్టాగ్రామ్ తరహాలోనే 10 ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే వెసులుబాటు కలదు.
2.థ్రెడ్స్ లో లిమిట్ చేసే ఆప్షన్ వుంది.తద్వారా మీరు ఆ వ్యక్తికి తెలియకుండానే వారి నుండి మిమ్మల్ని మీరు దూరంగా వుంచుకోవచ్చు, అంటే దీన్ని ఆన్ చేయడం ద్వారా మీరు ఆ వ్యక్తికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని చూడలేరు.
3.‘టేక్ ఎ బ్రేక్’( Take a Break ) ఆప్షన్ థ్రెడ్స్ లో అందుబాటులో ఉంది.
దీనిలో మీరు యాప్ నుంచి దూరం కావాల్సిన సమయాన్ని కూడా ఎంచుకోవచ్చు.కానీ ఇది ట్విట్టర్లో లేదు.

4.థ్రెడ్స్ లో నోటిఫికేషన్లను( Notifications ) కొంత సమయం పాటు ఆపడానికి వీలుంది.మీరు గరిష్టంగా 8 గంటల వరకు నోటిఫికేషన్స్ ని అదుపు చేయొచ్చు.ట్విట్టర్లో అలాంటి ఫీచర్ ఏదీ లేదు.
5.థ్రెడ్స్ ఇన్స్టాగ్రామ్ కి లింక్ అయినందున మీరు పోస్ట్ను థ్రెడ్లు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒకే క్లిక్తో షేర్ చేయవచ్చు.ట్విట్టర్లో ఇలా ఇతర ప్లాట్ఫాంల్లో చేసే అవసరం లేదు.
6.ఇక థ్రెడ్స్లో లాగిన్ చేయడం చాలా తేలిక.మొదటిసారి సైన్ అప్ చేయడం కూడా చాలా ఈజీ.ఎందుకంటే ఈ యాప్ ఇన్స్టాగ్రామ్( Instagram ) నుండి మొత్తం సమాచారాన్ని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది.ట్విట్టర్లో లాగిన్ కావడం మాత్రం థ్రెడ్స్తో పోలిస్తే కాస్త కష్టం అని మీకు తెలిసినదే.
