దక్షిణాది రాష్ట్రంలోనే తొలి సస్పెన్షన్ బ్రిడ్జీ నిర్మాణం సిద్ధిపేటలో

0
250

సిద్ధిపేట, అక్టోబరు 31: దక్షిణాది రాష్ట్రంలోనే తొలి సస్పెన్షన్ బ్రిడ్జీ నిర్మాణం సిద్ధిపేటలో చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కోమటి చెరువు- మినీ ట్యాంక్ బండ్ పై గురువారం మధ్యాహ్నం టూరిజం ఏండీ మనోహర్ తో కలిసి పర్యటించారు. ఈ మేరకు పద్మశ్రీ అవార్డు గ్రహీత- బ్రిడ్జీ మెన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన భరద్వాజ్, పతంజలి ఆధ్వర్యంలో రూ.6కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జీ నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేసినందుకు అభినందించి సన్మానించారు. వీరితో పాటు కర్ణాటక రాష్ట్ర టీమ్ సభ్యులందరూ 30 మందికి కుక్కర్లు గిఫ్ట్ గా మంత్రి చేతుల మీదుగా అందజేశారు. అయితే 240 మీటర్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పుతో 500 మీటర్ల రోప్ ఉండనున్నదని, ఈ బ్రిడ్జీ పై ఒకేసారి 200 మంది వరకూ వచ్చే వీలుగా ఉందని టూరిజం శాఖ వర్గాలు తెలిపాయి. కాగా కోమటి చెరువు- మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణలో భాగంగా అడ్వెంచర్ పార్కు వద్ద నిర్మిస్తున్న ఓపెన్ జిమ్, ఇతరత్రా సుందరీకరణ అభివృద్ధి పనుల గురించి టూరిజం ఏండీ మనోహర్ తో చర్చించి ఆధునీకరణ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, టూరిజం శాఖ ఎస్ఈ అశోక్, డీఈ సుదర్శన్, డీఈ పర్శవేది, సిబ్బంది పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here