త్రివిక్రమ్ వెర్సస్ బండ్ల.. పేలుతున్న మీమ్స్

Date:


బండ్ల, త్రివిక్రమ్ రైవల్రీ మీద మీమ్స్, జోక్స్ రెడీ చేసి వదిలేస్తున్నారు. ఒకప్పుడు సంచలనం రేపిన సెంటర్ ఫ్రూట్ యాడ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ను త్రివిక్రమ్, బండ్ల గణేష్ పోటీ పడి పొగడ్డం మొదలుపెడితే ఎలా ఉంటుందో చూపిస్తూ.. చివరికి ఈ పోటీలో బండ్లనే గెలిచినట్లుగా చేసిన మీమ్ భలే ఎంటర్టైనింగ్‌గా ఉంది. ఇలాంటి మీమ్స్ మరెన్నో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మరి ఈ వేడుకలో త్రివిక్రమ్, బండ్ల మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో.. ఆ ఇద్దరూ పవన్ గురించి ఏం మాట్లాడతారో చూడాలి.

పవన్‌కు తాను దూరం కావడానికి, ఆయనతో మళ్లీ సినిమా చేయలేకపోవడానికి కూడా త్రివిక్రమే కారణమని బండ్ల బలంగా నమ్ముతున్నాడు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్లో పరోక్షంగా త్రివిక్రమ్ మీద పంచులు కూడా వేశాడు. ఇలాంటి నేపథ్యంలో బండ్ల ‘బ్రో’ ఈవెంట్‌కు రాబోతుండటం, త్రివిక్రమ్‌తో వేదిక పంచుకోబోతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మీమర్స్ ఆల్రెడీ ఈ విషయంలో డ్యూటీ ఎక్కేశారు.

‘వకీల్ సాబ్’ వేడుకలోనూ బండ్ల అలాంటి పవర్ ఫుల్ స్పీచే ఇచ్చాడు. పవన్‌ను పొగడాలంటే బండ్ల తర్వాతే ఎవరైనా అనే ఫీలింగ్ అభిమానుల్లో ఉంది. ఫ్యాన్స్‌కు అతను అలాంటి కిక్ ఇస్తాడు. ఐతే ‘భీమ్లా నాయక్’ వేడుకకు పవన్ రాకపోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఆ సినిమాకు అన్నీ తానై వ్యవహరించిన త్రివిక్రమ్ శ్రీనివాసే.. బండ్లకు అడ్డం పడ్డాడనే ప్రచారం జరిగింది. స్వయంగా బండ్లనే ఒక అభిమానితో జరిపిన ఫోన్ సంభాషణలో త్రివిక్రమ్ మీద ఆరోపణలు గుప్పించాడు. బూతులు తిట్టాడు.

బండ్ల గణేష్ ‘బ్రో’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథుల్లో ఒకరిగా వస్తున్నారు అనగానే.. సోషల్ మీడియా జనాలు యాక్టివ్ అయిపోయారు. బండ్ల రాక పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద టాపిక్‌గా మారిపోయింది. పవన్ సినిమాల వేడుకల్లో బండ్ల చేసే హడావుడి అలా ఉంటుంది మరి. ‘గబ్బర్ సింగ్’ వేడుకలో పవన్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ బండ్ల గణేష్ చేసిన ప్రసంగం ఇప్పటికీ చర్చనీయాంశమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

సామాజిక, ఆర్థిక అసమానతలపై కలిసి పోరాడాలి –

– మార్క్స్‌, అంబేద్కర్లు మన మార్గదర్శకులు పుస్తకావిష్కరణలో– బీ.వీ.రాఘవులు, జే.బీ.రాజునవతెలంగాణ...

బ్యాడ్మింటన్‌ చాంప్స్‌ భవేష్‌, క్రిషవ్‌ –

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌...

ఏజెన్సీలో హైఅలర్ట్‌

– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం – పోలీసుల తనిఖీలు –...

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...