ప్రస్తుత సమాజంలో కొంతమంది నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దాడులు చేసి దోపిడీ చేసేస్తున్నారు.ఆ దాడిలో చివరికి దారుణంగా హత్య చేయడానికి అయినా వెనుకాడడం లేదు.
ఇలాంటి కోవలోనే దారి దోపిడీ దొంగలు( Thieves ) ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ పై కత్తులతో దాడి చేశారు.అంతటితో ఆగకుండా పక్కనే చిరు వ్యాపారం నిర్వహిస్తున్న మహిళ పై కూడా దాడి చేసి, ఏకంగా దారుణ హత్య చేసిన ఘటన తూనీ( Tuni ) సమీపంలో హైవేపై చోటు చేసుకుంది.
అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దమ్ము దుర్గారావు ఆదివారం సాయంత్రం అన్నవరంలో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు ఆటోలో వెళ్ళాడు.మళ్లీ తిరిగి వస్తుండగా తేటగుంట వద్ద ఇద్దరు ఆటో ఎక్కారు.
వారు రాజుల కొత్తూరు సమీపంలోకి వచ్చాక ఆటో డబ్బులు ఇవ్వడానికి నిరాకరించి, ఆటో డ్రైవర్ దుర్గారావు( Auto Driver Durgarao ) పైనే డబ్బుల కోసం కత్తులతో దాడి చేశారు.అనంతరం ఆటో డ్రైవర్ను బయటకు నెట్టేసి అదే ఆటలో వెళ్లి ఎర్రకోనేరు వద్ద రోడ్డు పక్కన కిల్లిబట్టి నిర్వహిస్తున్న పప్పు సత్యవతి( Pappu Satyavati ) అనే మహిళను డబ్బులు బంగారు ఇవ్వాలని బెదిరించారు.
సత్యవతి తన వద్ద డబ్బులు లేవు అని అనడంతో ఆమెపై కత్తులతో దాడి చేశారు.

సత్యవతి బిగ్గరగా కేకలు వేయడంతో ఆమె పెద్ద కూతురు నాగమణి తో పాటు చుట్టుపక్కల ఉన్న వారంతా అక్కడికి వచ్చారు.వారందరినీ దోపిడీదారులు బెదిరించి అక్కడి నుండి పరారయ్యారు.సత్యవతిని ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.
ఇక ఆటోడ్రైవర్ దుర్గారావు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ సంఘటన పోలీసులకు తెలియడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను నియమించినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
