తాజ్‌మహల్‌ చూసేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి.. షాకింగ్ వీడియో వైరల్..

Date:


ఢిల్లీ సమీపంలోని ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్‌( Taj Mahal )ను సందర్శించేందుకు డైలీ వేల మంది పర్యాటకులు వస్తుంటారు.అయితే సోమవారం తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చిన ఓ పర్యాటకుడికి చేదు అనుభవం ఎదురయింది.

 Delhi Tourist Chased Beaten In Agra Petha Shop Video Viral,taj Mahal, Tourist Be-TeluguStop.com

ఆగ్రాలోని పేట స్వీట్ షాప్‌( Petha Shop )లో అతడిని పట్టుకుని కొందరు స్థానికులు విచక్షణారహితంగా కొట్టారు.ఈ ఘటన షాప్‌లోని సీసీటీవీలో రికార్డు అయింది.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గానూ మారింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సదరు టూరిస్ట్ కారు ప్రమాదవశాత్తూ ఒకరిని తాకుతూ వెళ్ళిందట.

దాంతో ఆ టూరిస్ట్‌ను కారు తగిలిన వ్యక్తితో సహా కొందరు స్థానికులు వెంబడించినట్లు వీడియోలో కనిపించింది.

ఆ వ్యక్తులు తాజ్‌గంజ్ ప్రాంతం బ‌సై చౌకి ( Basai Chowki )లో పర్యాటకుడిని పట్టుకున్నారు.తరువాత స్వీట్‌ షాప్‌లోకి లాక్కెళ్లి కర్రలు, రాడ్లతో కొట్టడం ప్రారంభించారు.పర్యాటకుడు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించడాన్ని వీడియోలో చూడవచ్చు, కానీ దాడి చేసేవారు ఎక్కువమంది ఉండటంతో సదరు టూరిస్ట్( Tourist ) నిస్సహాయక స్థితిలో ఉండిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.టూరిస్ట్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని అభియోగాలు మోపారు.పర్యాటకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగా ఉందని పోలీస్ అధికారులు వెల్లడించారు.

ఈ సంఘటన భారతదేశంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.పర్యాటకుల భద్రత( Tourists Safety )ను మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్య తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్స్ వినిపిస్తున్నారు.ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మరోసారి అలాంటి ఘటన జరగకుండా చూస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం( Uttarpradesh Government ) హామీ ఇచ్చింది.

భారతదేశంలో పర్యాటకులు ఎదుర్కొనే ప్రమాదాలను ఈ ఘటన హైలెట్ చేస్తుంది.భారతదేశం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్నప్పటికీ, ప్రమాదాల గురించి తెలుసుకోవడం, సురక్షితంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

మాజీ డిప్యూటీ స్పీకర్‌ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

– అధికారిక లాంఛనాలతో నిర్వహణ– నివాళి అర్పించిన శాసనసభ స్పీకర్‌,...

సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి –

– ఈఎన్‌టీ రాష్ట్రస్థాయి సదస్సులో ఎమ్మెల్యే భాస్కరరావు– అత్యాధునిక పరికరాల...

మొన్నటి వరకూ కేంద్రాన్ని దునుమాడి.. ఇప్పుడు నోరెత్తని సీఎం

– కార్మికపక్షంపై నిరంకుశత్వం– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్యనవతెలంగాణ...

మతతత్వంతో దేశ విభజన! –

– మతానికి రాజకీయాన్ని జోడిస్తున్న బీజేపీ– మణిపూర్‌ మారణహోమంతో దేశ...