5.1 C
New York
Saturday, March 25, 2023
HomeNews`ఢీ` టీమ్ లాంచ్ చేసిన `సాఫ్ట్‌వేర్‌ సుధీర్` ట్రైల‌ర్!!_Ts360news

`ఢీ` టీమ్ లాంచ్ చేసిన `సాఫ్ట్‌వేర్‌ సుధీర్` ట్రైల‌ర్!!_Ts360news

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’.

ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా లేటెస్ట్ గా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ మాస్టర్ విడుదల చేసి టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో నటి పూర్ణ, శేఖర్ మాస్టర్, సుడిగాలి సుధీర్, ప్రదీప్, రష్మీ, వర్షిణి, హైపర్ ఆది, దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల, నిర్మాత శేఖర్‌ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ..

నటి పూర్ణ మాట్లాడుతూ – “ట్రైలర్ చాలా బాగుంది. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ ‘అన్నారు.

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ – “కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్ పలికించగల సుధీర్ హీరోగా చేస్తున్న మొదటి సినిమా. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. సుధీర్ మంచి డాన్సర్ కూడా..ట్రైలర్ లో కూడా డాన్స్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.

ప్రదీప్ మాట్లాడుతూ – “సుధీర్ ఈ సినిమాతో పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా. ట్రైలర్ కొత్తగా ఉంది. సుధీర్ కామెడీ టైమింగ్ గురించి మీ అందరికీ తెలిసిందే..ఈ సినిమాలో కామెడీ తో పాటు యాక్షన్, సెంటిమెంట్ కూడా బాగా చేశాడని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. `సాఫ్ట్ వేర్ సుధీర్` సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా ‘అన్నారు

రష్మీ మాట్లాడుతూ – ” టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా ట్రైలర్ మాత్రం చాలా హాట్ గా ఉంది. సుధీర్ డాన్సులు, ఫైట్స్ ఇరగదీసాడు. డైలాగ్స్ ట్రెండీ గా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా ద్వారా సుధీర్ పెద్ద స్టార్‌
అవ్వాలని కోరుకుంటున్నా. రాజశేఖర్ గారి టేకింగ్ చాలా బాగుంది. అలాగే ప్రొడ్యూసర్ గారికి ఇది ఫస్ట్ మూవీ. తప్పకుండా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.

హైపర్ ఆది మాట్లాడుతూ – ” జబర్దస్త్ షో లో కమెడియన్స్ చాలా మంది ఉన్నాం కానీ హీరో మెటీరియల్ మాత్రం సుధీర్ ఒక్కడే. సుధీర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడి డాన్సులు, ఫైట్స్ చేశాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా” అన్నారు.

యాంకర్ వర్షిణి మాట్లాడుతూ – ” సాఫ్ట్ వేర్ సుధీర్ ట్రైలర్ చూశాను చాలా బాగుంది. ముఖ్యంగా సుధీర్ పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా బాగుంది. ఈ సినిమాతో సుధీర్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు” అన్నారు.

హీరో సుధీర్ మాట్లాడుతూ – ” మా సినిమాలోని మొదటి పాటను జబర్దస్త్ టీమ్ విడుదల చేసింది. ఇప్పుడు మా మూవీ ట్రైలర్ ను ‘ఢీ’ టీమ్ తో లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. నన్ను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన మా అమ్మ నాన్న లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా”అన్నారు.

దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల మాట్లాడుతూ – ” మా ట్రైలర్ లాంచ్ చేసిన చిన్ని ప్రకాష్ మాస్టర్ కి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా సక్సెస్ సాధిస్తాం” అన్నారు.

చిత్ర నిర్మాత కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ – ”మా బేనర్ లో ఫస్ట్‌ మూవీ. కథ నచ్చి ఈ సినిమా ప్రొడ్యూస్‌ చేశాను. సుధీర్‌గారిని మా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్ లో హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది” అన్నారు.

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ పాటలో నటించారు. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే, డా. ఎన్‌. శివప్రసాద్‌, పృథ్వీ, సంజయ్‌ స్వరూప్‌, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్‌, ఆర్ట్‌: నారాయణరావు, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, నందు, స్టంట్‌ జాషువ, అంజి, డాన్స్‌: అనీష్‌ మాస్టర్‌, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలె, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, పాటలు: గద్దర్‌, సురేష్‌ ఉపాధ్యాయ, నిర్మాత: కె.శేఖర్‌రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.
=============================================================
‘Dhee’ Team Launches The Trailer of ‘Software Sudheer’

Sudigaali Sudheer who is quite popular with TV shows like Jabardasth, Dhee, Pove Pora is starring as a hero in a film titled ‘Software Sudheer’ co-starring ‘Raju gari Gadhi’ fame Dhanya Balakrishna as a heroine. ‘Software Sudheer’ is produced by Popular Industrialist K.Sekhar Raju in Sekhara Art Creations as production no – 1. Rajasekhar Reddy Pulicharla is debuting as director with this film. The recently released teaser of the film has received a very good response from the audience. Now, Popular choreographer Chinni Prakash master has released the trailer of ‘Software Sudheer’ and wished the entire team a great success. Actress Poorna, Sekhar master, Sudigaali Sudheer, Pradeep, Rashmi, Varshini, Hyper Aadi, Director Rajasekhar Pulicharla, Producer K Sekhar Raju attended the Trailer launch.

Actress Poorna said, ” Trailer looks very good. All the best to the entire team of ‘Software Sudheer’ “.

Sekhar Master said, ” Sudheer can perform all emotions like comedy, sentiment. This is his first film as a Hero. I liked the trailer a lot. Sudheer is a very good dancer. The dance movements shown in the trailer are very good. I wish the film to become a huge success.”

Pradeep said, ” I wish Sudheer to become a big star with this film. The trailer gives a new kind of feel. We all know about the comedy timing of Sudheer. Going by trailer, it seems like he has done a great job in action and sentiment along with the comedy. I hope ‘Software Sudheer’ will become a huge success.”

Rashmi said, ” Though the title, ‘Software Sudheer’ sounds soft, The trailer looks hot. Sudheer looks terrific is dances and fights. Dialogues are trendy. I wish Sudheer to become a big star with this film. Rajasekhar gari taking is too good. This is the first film for the Producer Sekhar Raju garu and I wish him a big success.”

Hyper Aadi said, ” There are a lot of comedians in ‘Jabardasth’ show. But, Sudheer is the only hero material. Sudheer worked very hard and did dances, fights for this film. I wish the film to become a superhit and the team will get fame and name.”

Anchor Varshini said, ” I have seen the trailer of ‘Software Sudheer’ and it is very good. Especially Sudheer’s performance, comedy timing, punch dialogues are too good. It has very good music. Sudheer will get good fame as a hero with this film.”

Sudheer said, ” The first song from our film is launched by the ‘Jabardasth’ team. I am very happy that the Trailer is launched by the ‘Dhee’ team. I heartfully thank each and everyone who came here today to wish me. I thank my parents who are the main reason for me to reach this stage.”

Director Rajasekhar Reddy Pulicharla said, ” Thanks to Chinni Prakash Master for launching our trailer and to everyone who came here today. I am very happy to know that you all loved the trailer. The film came out very well. We will definitely score a big success.”

Producer K Sekhar Raju says, ” ‘Software Sudheer’ is the first movie in our Sekhara Arts Creations banner. I decided to Produce this film as I liked the story narrated by Rajasekhar. I am happy that we are Introducing Sudheer garu as a hero in our banner. The film will surely become a superhit.”

Sudigaali Sudheer, Dhanya Balakrishna will be seen as lead pair while People’s Singer Gaddar will be featured in a song. Principle cast involves senior actress Indraja, Posani Krishna Murali, Nazar, Sayaji Shinde, Dr. N Siva Prasad, Prudhvi, Sanjay Swaroop, Ravi Kaale, Vidyullekha, Tarzan in other important roles.

Editing: Gowtham Raju, Cinematography: C Ram Prasad, Art: Narayana Rao, Music: Bheems Cecerolio, Fights: Ram – Lakshman, Nandu, Stunt Joshua, Anji, Dance: Aneesh master, Publicity Designer: Dhani Aelay, Production Executive: Bhikshapathi Thummala, Songs: Gaddar, Suresh Upadhyaya, Producer: K Sekhar Raju, Story, Screenplay, Dialogues, Direction: Rajasekhar Reddy Pulicharla

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments