జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.రేపు ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ కి కూడా ఆహ్వానం అందడంతో ఈరోజు సాయంత్రం తిరుపతి నుండి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ చేరుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల గురించి మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు తెలియజేస్తామని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఈ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా కలిసేదేమీ లేదని చెప్పుకొచ్చారు.ఎన్డీఏ సమావేశంలో ఏపీ ఎన్నికలపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీల మధ్య ఐక్యత ఇదేవిధంగా జనసేన పాత్ర పై చర్చ జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
ఎన్డీఏ పాలసీలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా భాగస్వామ్య పక్షాలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.